![Indian cricketer Veda Krishnamurthy announces engagement to Arjun Hoysala - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/12/Veda-Krishnamurthy.jpg.webp?itok=gKpHS-vt)
భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి, కర్ణాటక బ్యాటర్ అర్జున్ హొయసాల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రికెటర్లు ఇద్దరూ ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
అదే విధంగా తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో అర్జున్ మోకాళ్లపై కూర్చుని చాలా రొమాంటిక్‌గా వేదాకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా వెటరన్ క్రికెటర్ వేదా టీమిండియా తరపున 48 వన్డేలు, 76 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించింది. వేదా 2017 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులోనూ.. 2020 టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా భాగంగా ఉంది. కాగా గత కొంత కాలంగా భారత జట్టుకు వేదా దూరంగా ఉంది.
చదవండి: Asia Cup 2022: ఛాంపియన్ శ్రీలంకకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment