సెయిలింగ్‌లో కొత్త చరిత్ర
ఆసియా క్రీడల్లో తొలిసారి భారత మహిళలు సెయిలింగ్‌లో పతకం నెగ్గి చరిత్ర సృష్టించారు. వర్ష గౌతమ్, ఐశ్వర్య నెదున్‌చెజియాన్ ద్వయం 29ఈఆర్ డింగీ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచారు. 16 ఏళ్ల వర్ష, 18 ఏళ్ల ఐశ్వర్య జోడీ 11వ రేసులో నెగ్గి, చివరి రేసులో రెండో స్థానాన్ని సంపాదించారు. ఓవరాల్‌గా 25.0 నెట్ పెనాల్టీ పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకొని కాంస్యాన్ని ఖాయం చేసుకున్నారు. నొప్పకావో పూన్‌పట్, నిచాపా వైవై (థాయ్‌లాండ్-19.0 నెట్ పాయింట్లు) స్వర్ణం... ప్రిస్కిల్లా, సెసిల్లా (సింగపూర్-21.0 నెట్ పాయింట్లు) రజతం సాధించారు. ఆప్టిమిస్ట్ ఏకవ్యక్తి డింగీ రేసులో 12 ఏళ్ల చిత్రేశ్ తాతా ఆరో స్థానంలో నిలిచాడు.