
బాడీబిల్డర్ శ్వేత కొత్త చరిత్ర
ఆసియా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాడీబిల్డర్‌గా శ్వేతా రాథోడ్ చరిత్ర సృష్టించింది.
న్యూఢిల్లీ: ఆసియా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాడీబిల్డర్‌గా శ్వేతా రాథోడ్ చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన 25 ఏళ్ల శ్వేత ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ పోటీల్లో ఫిట్‌నెస్ ఫిజిక్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. తద్వారా వచ్చే నెలలో థాయ్‌లాండ్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఇంజినీరింగ్ చదివిన శ్వేత ముంబైలో ఫిట్‌నెస్ ఫరెవర్ పేరుతో అకాడమీని నిర్వహిస్తోంది. గతేడాది ముంబైలోనే జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ ఫిజిక్ చాంపియన్‌షిప్‌లో శ్వేతకు కాంస్య పతకం లభించింది.