భారత్ క్లీన్స్వీప్ | indian women beats srilanka in final one day | Sakshi
Sakshi News home page

భారత్ క్లీన్స్వీప్

Published Fri, Feb 19 2016 2:37 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

భారత్ క్లీన్స్వీప్ - Sakshi

భారత్ క్లీన్స్వీప్

రాంచీ: మరోసారి ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత మహిళలు.. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేశారు. మూడు వన్డేల సిరీస్లోభాగంగా శుక్రవారం ఇక్కడ ఇరు జట్ల మధ్యజరిగిన చివరి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.  తద్వారా భారత్ సిరీస్ను 3-0తో వైట్ వాష్ చేసింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక మహిళలు బ్యాటింగ్ చేసి 38.2 ఓవర్లలో 112 పరుగులకే చాపచుట్టేశారు. శ్రీలంక మహిళల్లో యశోదా మెండిస్(15),ప్రసాదని వీరక్కోడి(19), శశకళా సిరివర్ధనే(14) లు తీవ్రంగా నిరాశపరిచారు. శ్రీలంక తరపున సురంగికా చేసిన 23 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఆ తరుణంలో వేదా కృష్ణమూర్తి(61నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా, దీప్తి శర్మ(28) ఫర్వాలేదనిపించడంతో జట్టు స్కోరు ముందుకు కదిలింది. ఈ జోడీ మూడో వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ 29.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి మ్యాచ్ లో భారత మహిళలు 107 పరుగులతో విజయం సాధించగా, రెండో మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement