న్యూయార్క్(యూఎస్‌ఏ): భారత్ జరుగుతున్న గృహహింసతో మహిళల ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉన్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. కుటుంబసభ్యులు, భర్తల చేతిలో హింసకు గురవుతున్న భారతీయ మహిళలకు అమెరికా మహిళల కంటే 40 రెట్లు ప్రాణాపాయం ఉందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇండియా, అమెరికాల్లో జరిపిన పరిశీలనలో వెల్లడయింది. భర్త చేతుల్లో హింసకు గురవుతున్న ప్రతి నలుగురు బాధితుల్లో ఒక్కరు మాత్రమే వైద్యం చేయించుకుంటుండటమే ఇందుకు కారణమని ఈ పరిశోధన తేల్చింది.
రోడ్డు ప్రమాదానికి గురైనా ఎత్తైన భవనాలపై నుంచి కిందపడిన భారతీయులకు అమెరికా దేశస్తుల కంటే దాదాపు ఏడు రెట్లు తక్కువగా వైద్య సాయం అందే అవకాశాలున్నట్లు గుర్తించామని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకురాలు మోహిని దాసరి వెల్లడించారు. వెంటనే వైద్యం అందని కారణంగా మరణాల శాతం ఎక్కువగా ఉంటోందని తేలింది. ఈ పరిశోధక బృందం 2013-2015 కాలంలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాలకు చెందిన 11,670 కేసులను, పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లోని ట్రామా సెంటర్లలో నమోదైన 14,155 కేసులను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చింది.
గృహహింసతో పొంచి ఉన్న ముప్పు
Published Fri, Sep 1 2017 8:44 PM | Last Updated on Tue, Sep 12 2017 1:34 AM
Advertisement
Advertisement