జ్వాల జోడికి వాకోవర్ | Ashwini-Tarun pair bows out of World Badminton C'ships | Sakshi
Sakshi News home page

జ్వాల జోడికి వాకోవర్

Published Tue, Aug 26 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

జ్వాల జోడికి వాకోవర్

జ్వాల జోడికి వాకోవర్

బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్
కోపెన్‌హాగెన్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడి గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఈ జంటతో తలపడాల్సిన హీతర్ ఆల్వర్-కేట్ రాబర్ట్‌షా (ఇంగ్లండ్) ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత ద్వయానికి వాకోవర్ లభించింది. రెండో రౌండ్‌లో జ్వాల-అశ్విని, చైనాకు చెందిన ఐదో సీడ్ కింగ్ టియాన్-యున్‌లీ జావోను ఎదుర్కొంటారు.

గతంలో వీరితో తలపడిన ఆరు సార్లూ భారత జంట ఓటమిపాలైంది.  మరో వైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం భారత్‌కు చెందిన అశ్విని పొన్నప్ప-తరుణ్ కోన జోడి తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. ప్రపంచ 16వ ర్యాంక్ జంట అండర్స్ క్రిస్టియన్‌సెన్-జూలీ హౌమన్ (డెన్మార్క్) 21-16, 27-25తో అశ్విన్-తరుణ్‌పై విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement