‘రాజీవ్‌ క్రూరుడే’ | SAD Calls Rajiv Gandhi Indias Biggest Mob Lyncher | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ క్రూరుడే..

Published Mon, May 6 2019 12:03 PM | Last Updated on Mon, May 6 2019 12:03 PM

SAD Calls Rajiv Gandhi Indias Biggest Mob Lyncher - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) జాతీయ ప్రతినిధి మజీందర్‌ సింగ్‌ సిర్సా తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజీవ్‌ దేశంలోనే అతిపెద్ద మూకహత్యలకు పాల్పడిన క్రూరుడని వ్యాఖ్యానించారు. రాజీవ్‌ను నెంబర్‌వన్‌ అవినీతిపరుడిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు. ఓ వర్గానికి వ్యతిరేకంగా మూక హత్యలను ప్రేరేపించిన ప్రధానిగా రాజీవ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు.

ప్రధాని మోదీ చెప్పినట్టుగా రాజీవ్‌ అవినీతిలో అగ్రగణ్యుడే కాకుండా అతిపెద్ద మూకహత్యల ప్రేరేపకుడు కూడా అని ఆరోపించారు. సిక్కుల ఊచకోతను రాజీవ్‌ ప్రోత్సహించారని సిర్సా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దేశం కోసం ప్రాణాలర్పించిన దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎప్పుడో మరణించిన రాజీవ్‌పై ప్రధాని తాజా వ్యాఖ్యలు అమానవీయమని విపక్షాలు భగ్గుమన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement