ఐఎన్‌ఎస్‌ విరాట్‌లో వారసుల జల్సా.. | Jaitley Accused Gandhi Family Of Misusing Indias Naval Assets | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ విరాట్‌లో వారసుల జల్సా..

Published Thu, May 9 2019 11:32 AM | Last Updated on Thu, May 9 2019 11:42 AM

Jaitley Accused Gandhi Family Of Misusing Indias Naval Assets - Sakshi

వారలా..వీరిలా..

సాక్షి, న్యూఢిల్లీ : భారత నావికా దళ ఆస్తులను గాంధీ కుటుంబం దుర్వినియోగం చేసిందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను తమ కుటుంబం విహారం కోసం వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన మరుసటి రోజే ఇదే అంశంపై జైట్లీ ట్వీట్‌ చేశారు.

పనిమంతులు (కామ్‌దార్‌) దేశ నావికా సంపత్తిని ఉగ్రవాదులపై దాడులు చేసేందుకు ఉపయోగిస్తే వారసులు (నామ్‌దార్‌) వాటిని కుటుంబ సభ్యులతో జల్సా చేసేందుకు వ్యక్తిగత విహారానికి వాడుకుంటారని జైట్లీ ట్వీట్‌ చేశారు. అంతకుముందు భోఫోర్స్‌ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ రాజీవ్‌ గాంధీని ప్రధాని మోదీ అవినీతిలో నెంబర్‌ వన్‌ అని వ్యాఖ్యానించడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement