ఆయన రావణుడు.. | BJP Leader Calls Rajiv Gandhi As Raavan | Sakshi
Sakshi News home page

ఆయన రావణుడు..

Published Fri, May 10 2019 11:51 AM | Last Updated on Fri, May 10 2019 11:52 AM

BJP Leader Calls Rajiv Gandhi As Raavan - Sakshi

ఇండోర్‌ : సార్వత్రిక సమరం తుది అంకానికి చేరడంతో ప్రధాన పార్టీలు వ్యక్తిగత విమర్శలతో ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడుతున్నాయి. ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ధుర్యోదనుడిగా అభివర్ణించగా, కాషాయ పార్టీ నేత ఒకరు ఆమె తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని రావణుడిగా పేర్కొన్నారు.

బీజేపీ నేత జితు జిరాతి ఇండోర్‌లో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని ధుర్యోదనుడితో పోలుస్తున్నారు..అయితే ఆమె తండ్రి దేశాన్ని అమ్మిన రావణాసురుడని బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్‌ గాంధీ అవినీతిలో నెంబర్‌ వన్‌ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంతో ఇరు పార్టీల నడుమ వ్యక్తిగత విమర్శలు తారాస్ధాయికి చేరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement