సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు తమ ఎన్నికల ప్రచారంలోకి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని లాగడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్ హత్యకు బీజేపీదే బాధ్యతని మండిపడ్డారు. రాజీవ్ ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా సంస్ధలు హెచ్చరించినా అదనపు భద్రత కల్పించేందుకు అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం నిరాకరించడాన్ని బీజేపీ సమర్ధించిందని గుర్తు చేశారు.
విద్వేషం కారణంగానే రాజీవ్ తన ప్రాణాలు కోల్పోయారని, తనపై తప్పుడు ఆరోపణలకు బదులిచ్చేందుకు ఆయన మన మధ్య లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎన్‌ఎస్ విరాట్‌ను రాజీవ్ హయాంలో గాంధీ కుటుంబం తమ సొంత ట్యాక్సీలా వాడుకుందని ప్రధాని మోదీ విరుచుకుపడిన మరుసటి రోజు పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత జలాల వద్ద నిఘాను పర్యవేక్షించాల్సిన ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధ నౌకను పదిరోజుల పాటు రాజీవ్ కుటుంబ సభ్యుల విహార యాత్రకు ఉపయోగించుకున్నారని మోదీ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment