
చంఢీఘడ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, శిరోమణి అకాళీదళ్ కీలకనేత మాజిందర్ సింగ్ సిర్సా బుధవారం బీజేపీ కండువ కప్పుకున్నారు. కాగా, సిర్సా... కేంద్రం హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అదే విధంగా .. ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షేకావత్ కూడా పాల్గోన్నారు.
సిర్సా.. ఢిల్లీ సిఖ్ గురుద్వారా మెనెజ్‌మెంట్ కమిటీ (డీఎస్‌జిఎంసీ)కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమ సేవకార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మాజిందర్ సిర్సా మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీతో కలిసి సిక్కుల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. కాగా సిర్సా డీఎస్‌జిఎంసీకు రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. అదే విధంగా సిక్కుల అభివృద్ధికి నిష్పక్షపాతంగా, విలువలతో పనిచేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment