న్యూఢిల్లీ:పంజాబ్‌కు చెందిన ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం(అక్టోబర్7) సోదాలు జరిపింది. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్‌లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు జరిగాయి.
ఈ సోదాలపై ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.పార్టీని చీల్చేందుకే ఎంపీ సంజీవ్‌అరోరాపై ఈడీ సోదాలు చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐలతో ఆప్ సభ్యులను ఆపలేరని, ఎవరినీ కొనలేరని, భయపట్టలేరని సిసోడియా పేర్కొన్నారు.
వ్యాపారవేత్త కూడా అయిన ఎంపీ సంజీవ్ అరోరాపై దాడులతో తమ ధైర్యాన్ని దెబ్బతీయలేరని పార్టీకి చెందిన మరో ఎంపీ సంజయ్‌సింగ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్
Comments
Please login to add a commentAdd a comment