ఎంపీ జితేందర్‌రెడ్డికి నిరసన సెగ  | Protests Against TRS MP Jithender Reddy In Makthal | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 25 2018 9:05 AM | Last Updated on Tue, Dec 25 2018 11:27 AM

Protests Against TRS MP Jithender Reddy In Makthal - Sakshi

సాక్షి, ఆత్మకూర్‌: మహబూబ్‌నగర్‌ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ శ్రే ణుల నుంచి నిరసన ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్‌ నియోజకవర్గానికి సంబంధించి టీఆర్‌ఎస్‌ అసమ్మతి వర్గానికి సహకరించారని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు ‘ఎంపీ.. గో బ్యాక్‌’అంటూ నినాదాలు చేశారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ మక్తల్‌ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో జితేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. జితేందర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని ఓడించేందుకు  అసమ్మతి కుంపటిని రగిల్చారని ఆరోపిస్తూ మక్తల్, నర్వ మండలాల నేతలు నినాదాలు చేశారు. జితేందర్‌రెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాన ని, పార్లమెంటు సెగ్మెంట్‌లోని అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేశానన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement