
సాక్షి, హైదరాబాద్ : సీటు ఎందుకు రాలేదో తన దగ్గర సమాధానం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తన గురించి మంచి ఆలోచించే తప్పించి ఉంటారని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం నడుచుకుంటానని తెలిపారు. తనను వ్యతిరేకించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. పార్టీలో తనకు ఉన్నత స్థానం కల్పించారని తెలిపారు. గెలిచినా.. ఓడినా ప్రజల మధ్య ఉండి పనిచేస్తానని తేల్చిచెప్పారు.