CHITTEM RAM MOHAN REDDY
-
చిట్టెం రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన గ్రామస్థులు
-
మక్తల్: ప్రతీసారి భిన్న ప్రజాతీర్పు.. ఈసారి మాత్రం ఉత్కంఠే!
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గంలో ప్రతిసారి ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుంది. ఆ సెగ్మెంట్లో అన్ని పార్టీలో గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు నువ్వా..నేనా అన్నట్టు సాగే అవకాశం ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018లో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పాత టీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆరోపణ ఉంది. నియోజకవర్గం కేంద్రంలోని మున్సిపాలిటీని సైతం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ చిట్టెం సోదరి డీకే అరుణ ప్రభావం ఉండటంతో ఎమ్మెల్యేకు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చాయి. చిట్టెం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరుంది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఒక్కటి కూడ నిర్మాణం చేయలేదు. సంగంబండ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. నేరేడుగాం,ఉజ్జెల్లి,సంగంబండ పునరావాస గ్రామాల పరిస్దితి గురించి ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణ ఎమ్మెల్యే అండదండలతోనే చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.150 పడకల ఆస్పత్రి, హామీ ఇంకా నేరవేరలేదు ఇటీవల మంజూరీ వచ్చినా పనులు ప్రారంభించలేదనే మైనస్ ఉంది.రాజకీయాల్లో తన భార్య జోక్యం కొంత ఇబ్బందిగా మారవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఈసారి అక్కడి నుంచి పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త వర్కటం జగన్నాథం ఆసక్తి కనబరుస్తున్నారు. వర్కటం జగన్నాథం కరోనా సమయంలో అనేక సేవకార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య,పాఠశాలల్లో అమ్మాయిలకు మరుగుదొడ్లు,పదవ తరగతి విద్యార్దులకు స్టడీమెటీరియల్ ఇప్పించారు.మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి సైతం బీఆర్ఎస్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనకే సీటువస్తుందనే ధీమాలు ఉన్నారు.అయితే సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎమ్మెల్యే చిట్టెంకు ఊరటనిస్తుంది.ఇక్కడ సీటు విషయంలో పోటీ నెలకొనటం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. బీజేపీకి ఇక్కడ మొదట నుంచి మంచి క్యాడర్ ఉంది.మున్సిపల్ చైర్మన్ పీఠం కూడ ఆ పార్టీకే దక్కింది. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు ఎమ్మెల్యే వ్యవహారశైలి తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. డీకే అరుణ ప్రభావం కూడ ఇక్కడ ఉండే అవకాశం ఉండటంతో మరింత ప్లస్ కానుంది.అయితే ఇక్కడ కూడ మొదటి నుంచి పార్టీలో ఉండి రెండు సార్లు పోటీ చేసిన కొండయ్యకు,కొత్తగా పార్టీలో చేరిన జలంధర్‌రెడ్డికి మద్య పొసగటం లేదు.ప్రజాసంగ్రామయాత్రలో కూడ పోటాపోటీగా తమ బలప్రదర్శన చేశారు. జలంధర్‌రెడ్డి గత 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి రెండవ స్దానంలో నిలిచిచారు. ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన తర్వాత జలంధర్‌రెడ్డి నియోజవర్గానికి చుట్టపుచూపుగా మారారు. సీటు విషయంలో కొండయ్య,జలంధర్‌రెడ్డి మద్య ఏకాభిప్రాయం కుదిరితే పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే అధికార బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందిగానే ఉంది. ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాక పార్టీకి సరైన నాయకత్వమే కరువయ్యింది. ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం ఇక్కడి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాం నింపింది. మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ దివంగత వీరారెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి, నాగరాజు గౌడ్, ఎన్నారై పోలీస్ చంద్రశేఖర్రెడ్డిలు సీటు కోసం ఆశిస్తున్నారు. వీరారెడ్డి గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అది దేవరకద్ర నియోజకవర్గంగా పునర్విభజనలో మారింది. కానీ ఆత్మకూరు, నర్వ, అమరచింత మండలాలు ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గంలో ఉండటంతో పాటు, రాహుల్ జోడో యాత్రలో కీలకంగా పనిచేయటం తనకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. బీసీ గౌడ్ సామాజికవర్గానికి చెందిన నాగరాజు గౌడ్ గతంలో ఎన్ఎస్యూఐలో పనిచేశాడు. రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న ఇతను రాహుల్ల్గాం గాంధీ జోడోయాత్రలో హుషారుగా పనిచేసి పార్టీ నేతల దృష్టిని ఆకర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సీటు రాకుంటే మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి కూడ కాంగ్రేస్ లో చేరుతారనే ప్రచారం జోరుగాసాగుతుంది.కాంగ్రేస్ అభ్యర్ది అవుతారని ఆయన వర్గీయులు అంటున్నారు.2018లో మక్తల్‌లో టీడీపీ నుంచిపోటీ చేసిన సీతమ్మ భర్త దయాకర్‌రెడ్డి మూడోస్దానంలో నిలువగా 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై భరోసాపెట్టుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: ఆత్మకూర్ అమరచింత మండలాలు వనపర్తి జిల్లాలో, మదనాపూర్ మండలంలోని కొన్ని గ్రామాలు దేవరకద్ర నియోజకవర్గములో, ధన్వాడ మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు నారాయణపేట నియోజకవర్గములో అనుసంధానమై ఉన్నాయి.ఈ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉంది. నదులు: కృష్ణా, భీమా నదులు వర్షాకాలంలో పుష్కలంగా ప్రవహిస్తాయి రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది,చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. ఆలయాలు: కృష్ణానది తీరాన దత్తపీఠ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ముడుమాల నిలువు రాళ్లు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.కృష్ణాలో మొట్టమొదట రైల్వేస్టేషన్ ఉంది. -
కలెక్టర్ హరిచందనపై.. మక్తల్ ఎమ్మెల్యే మండిపాటు
నారాయణపేట: ‘జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ జీరోగా తయారైంది.. నా ఎమ్మెల్యే పదవి పోయినా పర్లేదు.. నేనేంటో చూపిస్తా.. ఇక్కడ నియంత పాలన సాగదు’ అంటూ నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కలెక్టర్ దాసరి హరిచందనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ ఎజెండా చదువుతుండగా సమావేశానికి డీఈవో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ‘కలెక్టరే సమావేశాలకు రారు.. ఇక జిల్లా అధికారులు ఎందుకు వస్తార’ని అసహనం వ్యక్తం చేశారు. ‘జెడ్పీ సమావేశమంటే పిల్లలాటైంది.. ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ పనికిమాలిన వాళ్లా.. వచ్చేసారి అందరం కలసి కలెక్టరేట్‌కు వెళ్లి జెడ్పీ మీటింగ్ పెట్టాలి’అని అన్నారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే, అక్కడ (కలెక్టరేట్లో) కలెక్టర్ రహస్య సమావేశాలు పెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ‘తెలంగాణ తెచ్చుకుంది.. జిల్లా వచ్చింది ఇందుకోసమేనా’ అని అసంతృప్తి వెళ్లగక్కారు. ఐదుగురు కనిపిస్తే కలెక్టర్‌కు బుగులు పుడుతుందని, వెంటనే పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తారని అన్నారు. సంగంబండ ముంపు బాధితులు కలెక్టరేట్‌కు వస్తే వారిని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. మక్తల్ నుంచి ఓ మహిళా సర్పంచ్ సమస్య పరిష్కారం కోసం వస్తే అగౌరవపరిచారని, ఇదే కలెక్టర్ బిల్డింగ్‌పై నుంచి దూకి చస్తానని ఆమె తనతో ఫోన్లో చెప్పారన్నారు. జిల్లాకేంద్రంలో రూ.కోట్ల విలువైన ఎస్ఎల్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వానికి ఇస్తే తమ సొసైటీ బిల్డింగ్ దగ్గరికి ఆర్అండ్బీ అధికారులను పంపించి పెనాల్టీ కట్టాలని నోటీసులు పంపించారన్నారు. భారత్‌మాల కోసం దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ధర నిర్ణయించి తిరిగి నోటిఫికేషన్ వేసి భూములు తీసుకోవాలని కోరారు. (క్లిక్: టీఆర్ఎస్కు రాజయ్య గుడ్‌బై) -
ఎంపీ జితేందర్‌రెడ్డికి నిరసన సెగ
సాక్షి, ఆత్మకూర్: మహబూబ్‌నగర్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డికి టీఆర్ఎస్ శ్రే ణుల నుంచి నిరసన ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్ అసమ్మతి వర్గానికి సహకరించారని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు ‘ఎంపీ.. గో బ్యాక్’అంటూ నినాదాలు చేశారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో జరిగిన టీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో జితేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. జితేందర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని ఓడించేందుకు అసమ్మతి కుంపటిని రగిల్చారని ఆరోపిస్తూ మక్తల్, నర్వ మండలాల నేతలు నినాదాలు చేశారు. జితేందర్‌రెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాన ని, పార్లమెంటు సెగ్మెంట్లోని అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేశానన్నారు. -
బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్ఎస్ లో చేరను: డీకే అరుణ
♦ మా తమ్ముడు నాన్నకు, నాకు మచ్చ తెచ్చాడు ♦ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొట్టిన చెంపదెబ్బ గుర్తు లేదా? ♦ చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై అరుణ ధ్వజం సాక్షి, హైదరాబాద్: కష్టాలు వస్తే బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్ఎస్లో చేరేది లేదని మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన తమ్ముడు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరడం దారుణమన్నారు. పైగా నియోజకవర్గ అభివృద్ధి, బీమా ప్రా జెక్టు కోసమే పార్టీ మారుతున్నాననడం సిగ్గుచేటన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలోనే బీమా 90 శాతం పూర్తయింది.ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ చేసేదేమిటి? నా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ప్రతిష్టకు, నా ప్రతిష్టకు రామ్మోహన్ మచ్చ తెచ్చాడు. కుటుంబ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాలను వమ్ము చేస్తూ పార్టీ మారడం సరైంది కాదు. 1996లో నేను టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేశాను. అప్పుడు మక్తల్ ఎమ్మెల్యేగా మా తండ్రి నర్సిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పని చేశారు. సొంత కూతురు ఓడిపోతుందని తెలిసినా పార్టీకే కట్టుబడ్డారు. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసి తన అంకితభావాన్ని నిరూపించుకున్నారు’’ అని డీకే గుర్తుచేశారు. 2004లో తన తండ్రిని, మరో సోదరుడిని నక్సల్స్ కాల్చి చంపితే, వారి వారసత్వంతో అనివార్యంగా రామ్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎవరి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారో, ఎవరి ప్రతిష్టకు మచ్చ తెచ్చారో, ఎవరి ఆశయాలకు తూట్లు పొడిచారో ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మొన్నటికి మొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతిలోనే రామ్మోహన్‌రెడ్డి చెంపదెబ్బ తిన్న విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. చెంప దెబ్బ కొట్టినా ఎలా వెళ్లాడో, కొట్టిన వ్యక్తి తాలూకు పార్టీలో ఎలా చేరారో అర్థం కావడం లేదన్నారు. నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలు చేయాలనుకుంటే కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ నుంచి మళ్లీ గెలవాలని తమ్మునికి అరుణ సవాలు విసిరారు. పార్టీ మారుతున్నట్టుగా తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అరుణ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. ‘‘నన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోంది. అయినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా టీఆర్ఎస్లోకి వెళ్లేది లేదు’’ అని స్పష్టం చేశారు. -
'పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం చెప్పాలి'
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీఎల్పీ నేత కె.జానారెడ్డి గురువారం హైదరాబాద్‌లో పిలుపునిచ్చారు. ఓ పార్టీలో గెలిచి... మరోపార్టీలోకి వెళ్లడం అప్రజాస్వామికమని ఆయన అరోపించారు. గతంలో నేను రాజీనామా చేశాకే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయిస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఫిరాయింపులను ప్రోత్సహించదని చెప్పారు. పార్టీ మారేవారిని అనర్హులుగా ప్రకటించేలా చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి జానారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన మెదక్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జానారెడ్డి పైవిధంగా స్పందించారు. -
నేడు గవర్నర్‌ను కలవనున్న టీ సీఎల్పీ నేతలు
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే బాలరాజు దాడి అంశాన్ని టీ కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై శనివారం మధ్యాహ్నం 2.00 గంటలకు గాంధీభవన్‌లో టి. కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. అనంతరం టి.కాంగ్రెస్ నేతలు రాజభవన్‌కు చేరుకుని.... చిట్టెంపై దాడి చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు వారు వినతిపత్రం అందజేయనున్నారు. శుక్రవారం ఉదయం 11.30కు జెడ్పీ సమావేశం ప్రారంభం కాగానే జిల్లాలో కరువుపై చర్చకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన జెడ్పీ చైర్మన్ భాస్కర్, మంత్రి జూపల్లి తొలుత చర్చించి, తర్వాత తీర్మానం చేద్దామన్నారు. నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడబోతుండగా టీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలను నిలిపేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖను ఉపసంహరించుకునేదాకా టీడీపీ సభ్యులకు మాట్లాడే హక్కు లేదంటూ వారు ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ భోజన విరామం ప్రకటించారు. తర్వాత తిరిగి సమావేశం మొదలవగానే గువ్వల బాలరాజు మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకోవడానికి కారణమైన పరిస్థితులను వివరిస్తూ జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు కొందరిపై, మాజీ మంత్రి డీకే అరుణ, వారి కుటుంబ సభ్యులపై విమర్శల వర్షం కురిపించారు. దళితులను మాజీ మంత్రి డీకే అరుణ పట్టించుకోరని జెడ్పీ చైర్మన్ సైతం వ్యాఖ్యానించారు. దాంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న డీకే సోదరుడైన ఎమ్మెల్యే చిట్టెం పోడియం వద్దకు దూసుకెళ్లారు. బాల్‌రాజ్ అసందర్భ ప్రసంగాన్ని ఎలా అనుమతిస్తారంటూ మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిలతో వాగ్వాదానికి దిగారు. బాల్‌రాజ్ సైతం పోడియం దగ్గరకు చేరుకున్నారు. ఇరువురూ వ్యక్తిగత దూషణలకు దిగారు. బాల్‌రాజు ఆవేశంతో చిట్టెం చెంపపై కొట్టారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. చిట్టెం తనను దూషించారని, దాడికి పాల్పడటంతో తన పెదవికి గాయమైందని చెబుతూ బాల్‌రాజు కూడా టీఆర్ఎస్ సభ్యులతో కలసి బైఠాయించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం చిట్టెం రాంమోహన్‌రెడ్డి... గువ్వల బాలరాజు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి నేపథ్యంలో శనివారం మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది.