BJP MP Ramshankar Katheria.. లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఎంపీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన లోక్‌సభకు అనర్హుడయ్యే అవకాశం కూడా ఉంది. అయితే, సదురు ఎంపీకి ఓ వ్యక్తిపై దాడి కేసులో కోర్టు జైలు విధించడం విశేషం.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఇతావా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రామ్ శంకర్ కటారియాకు ఆగ్రా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో కటారియాకు కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ నుంచి అనర్హత వేటు పడే అవకాశమున్నది. కాగా, 2011లో ఆగ్రాలోని విద్యుత్ సరఫరా కంపెనీ మేనేజర్‌పై తన అనుచరులతో కలిసి దాడి చేశారు. నాడు ఆగ్రా ఎంపీగా ఉన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రామ్ శంకర్ కటారియాను దోషిగా నిర్ధారించింది. రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించింది.
ఇదిలా ఉండగా.. కోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ రామ్ శంకర్ స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తానని తెలిపారు. అయితే రెండేళ్ల జైలు శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన న్యాయ విధానాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రామ్ శంకర్ కటారియా నవంబర్ 2014 నుండి జూలై 2016 వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. అతను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆఫ్ డిఫెన్స్ మరియు కన్సల్టేటివ్ కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సభ్యుడుగా కొనసాగారు.
#WATCH | "...I appeared before the court normally. Court has given a decision against me today. I respect the court, I have the right to appeal and I will exercise it," says BJP MP Ramshankar Katheria #RamshankarKatheria pic.twitter.com/QVmx8pfcAX
— NewsMobile (@NewsMobileIndia) August 5, 2023
ఇది కూడా చదవండి: గుజరాత్‌లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్ గుడ్ బై
Comments
Please login to add a commentAdd a comment