
ప్రమాదానికి గురైన కారు
సాక్షి, చెన్నై : ఏఐఏడీఎంకే లోక్‌సభ ఎంపీ కె.కామరాజ్ కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఆయనకు స్పల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సేలం జిల్లాలోని వలప్పాడిలో ఆదివారం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీ కారును అతని డ్రైవర్ నడుపుతున్నాడు. అతివేగం కారణంగా అతను వాహనంపై పట్టుకోల్పోడంతో అదుపుతప్పి వలప్పాడిలోని మిన్నంపల్లి వద్ద పల్టీలు కొట్టింది.
ఘటనలో ఎంపీ చేతికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్, ఎంపీ సహాయకుడు కూడా స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, శనివారం జరిగిన మరో కారు ప్రమాదంలో ఏఐఏడీఎంకే ఎంపీ రాజేంద్రన్ (62) దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం జిల్లా దిండివనమ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనటంతో ఎంపీ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. (అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్ మృతి)