చెన్నై: మందుబాబులు తప్ప తాగి.. తమ ఇంటికి బదులు వేరే వాళ్ల ఇంట్లోకి వెళ్లి.. గొడవ చేయడం.. ఆనక ఆ ఇంటి వారి చేతులో దెబ్బలు తినే సన్నివేశాలను ఎక్కువగా సినిమాలో చూస్తుంటా. రియాలిటీలో కూడా అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.
తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మాజీ ఎంపీ ఒకరు తప్ప తాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ రచ్చ చేయడంతో ఆగ్రహించిన సదరు ఇంటి యాజమాని.. మాజీ ఎంపీని చికతబాదాడు. ఆ వివరాలు..
(చదవండి: ‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’)
ఈ సంఘటన దీపావళి పండుగ నాడు చోటు చేసుకుంది. అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్ ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ మత్తులో మదురై నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ నివాసంలోకి ప్రవేశించారు. వచ్చిన వ్యక్తి ఎంపీ అని వారికి తెలియదు. తాగిన మత్తులో వచ్చి ఉంటాడు అని భావించిన ఆ ఇంటి సభ్యులు బయటకు వెళ్లాల్సిందిగా కోరారు.
కానీ గోపాలకృష్ణన్ వారి మాట వినకుండా.. ఆ ఇంట్లో రచ్చ చేశాడు. తాగుబోతు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఆగ్రహించిన ఆ కుటుంబ యజమాని ఎంపీని చితకబాదాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.
(చదవండి: మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు... )
ఫిర్యాదుదారుడి ఇంటికి చేరుకున్న పోలీసులు గోపాలకృష్ణన్‌ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మాజీ మంత్రి అని తెలిపారు. అనంతరం గోపాలకృష్ణన్‌ని కూనూర్ ఆస్పత్రిలో చేర్చారు.
చదవండి: ‘దొంగ’ తెలివి.. అమ్మవారికి మొక్కి పని కానిచ్చేశాడు.. వైరలైన దృశ్యాలు
Comments
Please login to add a commentAdd a comment