హైదరాబాద్ : పార్లమెంటులో పదునైన ప్రసంగాలతో అధికార పక్షంపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మెయిత్రా పోచంపల్లి పట్టులో మెరిసిపోయారు. భారతీయ హస్తకళలను ఆమె మెచ్చుకుంటూ మోస్ట్ బ్యూటిఫుల్ పోచంపల్లి కాటన్ శారీ అంటూ ప్రశంసలు అందించారు. తెలంగాణ బహుమతిగా మంత్రి కేటీఆర్ ఈ చీరను అందించారని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు.
Indian handlooms rock - wearing the most beautiful Pochampalli cotton saree from Telengana gifted to me on recent IT committe tour by @KTRTRS pic.twitter.com/jB30pxFeZN
— Mahua Moitra (@MahuaMoitra) September 14, 2021
ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు నిర్వహిస్తోన్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బ్రాండ్ ప్రమోషన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించిన హస్త కళలను ఆయన ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ మహువా మోయిత్రా హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మెయిత్రాకి పోచంపల్లి పట్టు చీరను బహుకరించారు మంత్రి కేటీఆర్. ఆ చీరను మరింత ఆధునిక పద్దతిలో ధరించారు ఎంపీ మహువా మెయిత్రా.
Comments
Please login to add a commentAdd a comment