
సాక్షి, కరీంనగర్ : టీఆర్‌ఎస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ బి. వినోద్ కుమార్‌పై 87 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తన కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. కార్పోరేటర్ పదవికి రాజీనామా లేఖను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టె మురళీకృష్ణ ద్వారా నగరపాలక సంస్థ కమీషనర్ భద్రయ్యకు పంపించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయిన బండి సంజయ్‌కు సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల, సానుభూతి పవనాలు వీచాయి. అయితే తెలంగాణలో నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల్లో ఎక్కువ మెజార్టీ వచ్చింది బండి సంజయ్‌కే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment