MP A Sumalatha Extends Support To BJP - Sakshi
Sakshi News home page

సుమలత పొలిటికల్‌ యూటర్న్‌: మొన్న లేదన్నారు.. నిన్న కమలానికే జై కొట్టారు

Published Sat, Mar 11 2023 6:16 AM | Last Updated on Sat, Mar 11 2023 11:29 AM

MP A Sumalatha extends support to BJP - Sakshi

మాండ్య: మాజీ నటి,  కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్‌(59).. ఊహించని స్టేట్‌మెంట్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీకి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. నాలుగేళ్లుగా మాండ్య లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఆమె హఠాత్తుగా తన మద్దతును కమలానికి ప్రకటించడం గమనార్హం. 

మోదీ నాయకత్వంలో భారత్‌కు లభించిన సుస్థిరత, దేశం ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ‘నాలుగేళ్లపాటు స్వతంత్రంగా వ్యవహరించాను. ఈ సమయంలో బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం వంటి విషయాల్లో పలు సవాళ్లను ఎదుర్కొన్నాను. వీటిని దృష్టిలో ఉంచుకునే మద్దతు అవసరమని భావించాను. అందుకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాను’అని ఆమె మీడియాతో అన్నారు.

కన్నడ అగ్ర నటుడు దివంగత అంబరీష్‌ భార్య అయిన సుమలత బహు భాషా నటి.  సుమారు 220కిపైగా సినిమాల్లో నటించారామె. 2019 మాండ్యా ఎన్నికలో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. కిందటి నెలలో ఆమె బీజేపీలో చేరతారంటూ వచ్చిన వార్తలను ఖండించిన ఆమె.. ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో తన మద్దతు ఉండబోదంటూ ప్రకటించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement