పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసిన విజయలక్ష్మి
దొడ్డబళ్లాపురం: పవిత్రగౌడ కేవలం దర్శన్ స్నేహితురాలు మాత్రమే. ఆయనకు చట్ట ప్రకారం భార్యను నేనే, పోలీసులు ఫైల్స్‌లో నా పేరు మాత్రమే భార్యగా నమోదు చేయాలంటూ దర్శన్ భార్య విజయలక్ష్మి బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్‌కు లేఖ రాశారు.
దర్శన్ తాను 2003లో హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మస్థలంలో వివాహం చేసుకున్నామని, చట్ట ప్రకారం తాను మాత్రమే భార్యనని, పోలీసులు మాట్లాడేటప్పుడు, ప్రకటన ఇచ్చేటప్పుడు పవిత్రను భార్యగా పేర్కొనడం వల్ల ఈ లేఖ ద్వారా స్పష్టత ఇస్తున్నానన్నారు. దర్శన్‌కు తనకు ఒక కుమారుడు ఉన్నాడని, అదేవిధంగా పవిత్రకు కూడా సంజయ్ సింగ్ అనే మరో వ్యక్తితో వివాహం జరిగిందని, వారికీ ఒక కుమార్తె ఉందని అందువల్ల పోలీసులు ఇకపై తనను మాత్రమే దర్శన్ భార్యగా గుర్తించాలన్నారు.
18 వరకు దర్శన్‌కు కస్టడీ..
రేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. గురువారంతో దర్శన్, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్ గ్యాంగ్‌కి నిరాశ ఎదురైంది. జూలై 18 వరకూ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు.
దర్శన్ కేసుపై సుమలత స్పందన..
యశవంతపుర: నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్. అని సుమలత అంబరీష్ పేర్కొన్నారు. ప్రముఖ నటుడు దర్శన్ హత్య కేసులో జైలు పాలు కావడంపై ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
కొడుకు, భర్తను పోగొట్టుకున్న రేణుకాస్వామి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. దుఃఖం నుంచి ఆ కుటుంబం బయటకు రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దర్శన్ కేసులో ఇంతవరకు తను మౌనంగా ఉన్నందుకు అనేక మంది కామెంట్లు చేశారు. దర్శన్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి, 25 ఏళ్ల నుంచి దర్శన్‌ను చూస్తున్నాను అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment