సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
అంతకముందు కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మోసగాడని విమర్శించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన బాబు.. రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని మండిపడ్డారు. విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శౠతం టీడీపీ ఖాళీ కాబోతోందని అన్నారు.
విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని.. చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నానని కేశినేని నాని అన్నారు. ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన.
Comments
Please login to add a commentAdd a comment