తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికలలో సిట్టింగ్ అన్నాడీఎంకే ఎంపీ వేణుగోపాల్ తన స్థానాన్ని దక్కించుకన్నారు. అన్నాడీఎంకే భారీ మోజారిటీతో విజయం సాధించడంతో అ పార్టీ కార్యకర్తలు సంబరాలలో మునిగిపోయారు. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని విజయోత్సవ ర్యాలీనీ నిర్వహించారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి గత ఏప్రిల్ 24న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి న ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభిచారు. మొత్తానికి అన్ని రౌండ్‌లలో తమ సత్తా చాటిన అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్ తమ సమీప ప్రత్యర్థి రవికుమార్‌పై మూడు లక్షలపైగా ఓట్లతో తేడాతో విజయం సాధించారు. భారీ మెజారిటీతో గెలుపొందిన వేణుగోపాల్‌కు కలెక్టర్ వీరరాఘవరావు, ఎన్నికల పరిశీలకుడు అనంతరామ్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
సిట్టింగ్ ఎంపీకే పట్టం
Published Fri, May 16 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM
Advertisement
Advertisement