'ఓటుకు మూడు వేలు పంచుతున్నారు'
'ఓటుకు మూడు వేలు పంచుతున్నారు'
Published Wed, Apr 23 2014 4:54 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
చెన్నై: ఓటర్లను డబ్బుతో ప్రలోభపెడుతున్నారని అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) పార్టీపై డీఎంకే పార్టీ ఎన్నికల కమీషన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే ఓటుకు మూడు వేల రూపాయలు పంచుతోందని, బహుమతులతో మభ్యపెడుతున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా పోలీసులు అన్నాడీఎంకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని డీఎంకే ఆరోపణలు చేసింది. అన్నాడీఎంకే పార్టీ సభ్యులపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని డీఎంకే పార్టీ నేత ఎంకే స్టాలిన్ అన్నారు. పోలీసుల, ఇతర అధికారుల వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు.
Advertisement
Advertisement