TN Assembly: ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కోటీశ్వరులే! | Survey TN Leaders Education Qualification Financial Status Criminal Cases | Sakshi
Sakshi News home page

TN Assembly: ఆ పార్టీలో 89 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే!

Published Fri, May 7 2021 8:35 AM | Last Updated on Fri, May 7 2021 4:18 PM

Survey TN Leaders Education Qualification Financial Status Criminal Cases - Sakshi

సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెల్లడవడంతో నూతన శాసనసభ కొలువుదీరనుంది. అన్ని   పార్టీల ఎమ్మెల్యేల స్థితిగతులపై ‘జననాయక సీరమైప్పు కళగం’ ఓ సర్వే నిర్వహించింది. తాజా ప్రజాప్రతినిధుల విద్యార్హత, ఆదాయం, నేర చరిత్ర తదితర అంశాలపై ఆసక్తికర సమాచారం వెల్లడించింది. ప్రస్తుత శాసనసభ్యుల్లో కోట్లకు పడగలెత్తిన వారు అధిక సంఖ్యలో ఉన్నారని పేర్కొంది. బడి మెట్టు దాటని వారూ భారీగానే ఉన్నట్లు తెలిపింది. క్రిమినల్‌ కేసులు నమోదైన వారు ఎక్కువగానే ఉన్నారని వివరించింది. ఈ క్రమంలోనే కొందరు నిరాడంబరులూ ఉన్నట్లు తెలియజేసింది.  

సాక్షి ప్రతినిధి, చెన్నై : సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన మొత్తం 234 మంది ఎమ్మెల్యేల సమగ్ర వివరాలను ‘జననాయక సీరమైప్పు కళగం’ సర్వే వెలుగులోకి తీసుకువచ్చింది. తాజా ఎమ్మెల్యేల్లో తిరునల్వేలి జిల్లా అంపసముద్రం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సుబ్బయ్య నెంబర్‌వన్‌ కోటీశ్వరుడని సర్వే తేల్చింది. సుమారు రూ.246కోట్ల ఆస్తులతో సుబ్బయ్య ప్రథమస్థానంలో నిలిచారు. అలాగే తిరుత్తురైపూండి నుంచి సీపీఐ తరఫున ఎన్నికైన మారిముత్త కేవలం రూ.3లక్షల ఆస్తితో చివరిస్థానం దక్కించుకున్నారు. నిరాడంబరమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. 2016 ఎన్నికల్లో మొత్తం 76మంది కోటీశ్వరులు ఎమ్మెల్యేలుగా గెలవగా, ప్రస్తుతం ఆ సంఖ్య 86కు పెరగడం విశేషం. అలాగే 2016లో 34శాతం మంది నేర చరిత్ర ఉన్నవాళ్లు అసెంబ్లీకి ఎన్నికైతే ఇప్పుడు అది 60శాతానికి చేరడం గమనార్హం.

పార్టీ పేరు      కోటీశ్వరులైన ఎమ్మెల్యేల శాతం 
డీఎంకే             89 
అన్నాడీఎంకే     88 
కాంగ్రెస్‌             58 
పీఎంకే              60 
బీజేపీ              75 

పార్టీ పేరు              క్రిమినల్‌ కేసులు నమోదైనవారి సంఖ్య 
డీఎంకే  -                36 
అన్నాడీఎంకే    -       15 
(వీరిలో ఐదుగురిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి) 
కాంగ్రెస్‌      -            12 
పీఎంకే      -              04 
వీసీకే      -               03 
బీజేపీ    -                04 
సీపీఐ  -                  02 

ఎమ్మెల్యేల వయసు వివరాలు 
31–40 ఏళ్ల మధ్య వయస్కులు -    14 మంది 
41–50 ఏళ్లు ఉన్నవారు      -        60 మంది 
51– 70 ఏళ్లు వయసువారు -        135 మంది 
71–80 ఏళ్ల మధ్య వయస్కులు-    14 మంది 
80 ఏళ్లు దాటినవారు  -                ఒకరు  

ఎమ్మెల్యేల విద్యార్హత 
పాఠశాల విద్యకే పరిమితమైనవారు- 77 మంది 
డిగ్రీ అంత కంటే ఎక్కువ చదివినవారు-    136 మంది 
వైద్యవిద్య అభ్యసించినవారు-     ఆరుగురు  

చదవండి: MK Stalin Cabinet: తమిళనాడు కొత్త మంత్రులు వీరే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement