తిరువళ్లూరు: డివైడర్‌ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆవడి సమీపంలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు గ్రామానికి చెందిన భాస్కరన్. ఇతను కానిస్టేబుల్‌గా రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం భాస్కరన్ సోదరి లోకనాయగి ఇంటి గృహ ప్రవేశానికి హాజరై శనివారం రాత్రి పది గంటలకు కుమార్తె ప్రీతితో కలిసి వేపంబట్టుకు బైక్‌లో బయలుదేరారు. ఆవడి సమీపంలోని మోరై వద్ద వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో భాస్కరన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ప్రీతిని స్థానికులు చెన్నై వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిక్షించిన వైద్యులు ప్రీతి అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసు కస్టడీలో మృతి?
టీ.నగర్: పోలీసు కస్టడీలో వ్యక్తి మృతి వ్యవహారంపై తిరుమంగళం అమముక అభ్యర్థి ఆదినారాయణన్ సహా నలుగురు మదురై హైకోర్టు బెంచ్ ఎదుట హాజరయ్యారు. మదురై సోలైయళగుపురం ముత్తుకరుప్పన్ కుమారుడు డ్రైవర్ బాలమురుగన్. అతన్ని ఒక కిడ్నాప్ కేసులో అవనియాపురం పోలీసులు 2019లో చట్టవిరుద్ధంగా పోలీసు స్టేషన్‌లో ఉంచి దాడి చేశారు. దీంతో అతను మృతిచెందినట్లు వార్తలు వ్యాపించాయి.
ఈ కేసుపై శనివారం విచారణ జరిగింది. న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానం, ఎస్ ఆనంద్ విచారణ జరిపారు. పోలీసుల దాడిలో బాలమురుగ న్ మృతిచెందలేదని, ప్రమాదంలో గాయపడి మృతిచెందినట్లు తెలిసింది. ఈ కేసులో ఆదినారాయణన్ సహా నలుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. దీనిపై జూన్ 14న రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment