టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. కానీ వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యిందని, రేపు(మార్చి 3వ తేదీ) వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అతి కొద్ది మంది బంధుమిత్రుల, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మనోజ్-మౌనికలు ఏడడుగులు వేయబోతున్నారని సమాచారం.
కానీ ఇప్పటివరకు వీరి పెళ్లి గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా గతంలో మనోజ్, మౌనికలు పలుమార్లు జంటగా ఈ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి. అంతేకాదు ఆ మధ్య మీడియాతో మాట్లాడిన మనోజ త్వరలో శుభవార్త చెప్పబోతున్నానంటూ హింట్ ఇచ్చాడు. అతడి రెండో పెళ్లి గురించే అంటూ అభిమానులంతా ఫిక్స్ అయ్యారు. అయితే గతంలో మనోజ్‌కు ప్రణతి అనే అమ్మాయితో వివాహం జరగ్గా మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అటూ మౌనికకు కూడా ఇదివరకే పెళ్లై, విడాకులైన విషయం విధితమే. ఇక మనోజ్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ అనే సినిమా చేస్తున్నాడు.
చదవండి:
HYD: కేబీఆర్ పార్క్‌లో నటికి చేదు అనుభవం, ఆమెను వెంబడిస్తూ..
47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి
Comments
Please login to add a commentAdd a comment