
మంచు మనోజ్ టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మోహన్‌బాబు తనయుడిగా నటనను అందిపుచ్చుకున్న మనోజ్ తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే మాజీమంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆదివారం మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ చేరుకున్నారు మనోజ్. పెళ్లి అయ్యాక తొలిసారి జంటగా వెళ్లిన మనోజ్‌కు ఘనస్వాగతం లభించింది. విద్యార్థులంతా ఒక్కసారిగా నూతన దంపతులకు ఆహ్వానం పలికారు.
తాజాగా ఈ వీడియోను మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కారులో శ్రీ విద్యానికేతన్ చేరుకున్న మనోజ్, మౌనికలకు వేలమంది విద్యార్థులు వరుసలో నిలబడి ఘనస్వాగతం పలికారు. విద్యాసంస్థలోకి మనోజ్ అడుగు పెట్టగానే విద్యార్థుల హర్షధ్వానాలు మిన్నంటాయి. అంతేకాకుండా ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకెళ్లారు నూతన వధువరులు. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ నెక్ట్స్ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆదివారం మార్చి 19న తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. మోహన్ బాబు బర్త్‌డే వేడుకలను శ్రీ విద్యానికేతన్‌లో ఘనంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment