bhuma
-
మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డి కుమారుని బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
హీరో పెళ్లిలో మంచు మనోజ్- మౌనిక సందడి (ఫొటోలు)
-
మంచు మనోజ్ మాటలకు ఎమోషనల్ అయిన మౌనిక
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనికతో ఇటీవలె ఏడుడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మోహన్‌బాబు 71 జన్మదిన వేడుకలు తిరుపతిలో జరగ్గా, మనోజ్ తన భార్య మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ ఎమోషనల్‌గా ప్రసంగించారు. ''జీవితంలో గెలుపోటములు సహజం. అందరి జీవితాల్లో ఏదో ఒక ఫేజ్‌లో అందకారం చుట్టేస్తోంది. నాకు కూడా గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ నాకు అండగా నిలబడింది. ఆ చీకటి కమ్ముకున్నప్పుడు వెలుతురులా మౌనిక కనిపించింది. ప్రతి మగాడి గెలుపు వెనుకాల ఆడవారు ఉంటారు. ఆడవారి విజయం వెనుక కూడా మగాళ్లు ఉండాలి'' అంటూ మనోజ్ పేర్కొనగా ఆ మాటలకు మౌనిక సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. -
మనోజ్- మౌనిక దంపతులకు గ్రాండ్ వెల్కమ్.. వీడియో వైరల్
మంచు మనోజ్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మోహన్‌బాబు తనయుడిగా నటనను అందిపుచ్చుకున్న మనోజ్ తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే మాజీమంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆదివారం మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ చేరుకున్నారు మనోజ్. పెళ్లి అయ్యాక తొలిసారి జంటగా వెళ్లిన మనోజ్‌కు ఘనస్వాగతం లభించింది. విద్యార్థులంతా ఒక్కసారిగా నూతన దంపతులకు ఆహ్వానం పలికారు. తాజాగా ఈ వీడియోను మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కారులో శ్రీ విద్యానికేతన్ చేరుకున్న మనోజ్, మౌనికలకు వేలమంది విద్యార్థులు వరుసలో నిలబడి ఘనస్వాగతం పలికారు. విద్యాసంస్థలోకి మనోజ్ అడుగు పెట్టగానే విద్యార్థుల హర్షధ్వానాలు మిన్నంటాయి. అంతేకాకుండా ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకెళ్లారు నూతన వధువరులు. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ నెక్ట్స్ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆదివారం మార్చి 19న తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. మోహన్ బాబు బర్త్‌డే వేడుకలను శ్రీ విద్యానికేతన్‌లో ఘనంగా నిర్వహించారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
భూమా సినీ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు
సాక్షి, తిరుపతి: తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూమా సినీ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా భూమా కాంప్లెక్స్ మూతపడింది. -
భుమాకు షాక్: వైఎస్ఆర్సీపీలోకి చాబోలు గ్రామస్థులు
-
శోక సంద్రం
-
భూమాకు కన్నీటి వీడ్కోలు
– అశ్రునయనాల మధ్య భూమా అంతిమ యాత్ర – భారీగా తరలివచ్చిన ప్రముఖులు – జనసంద్రమైన ఆళ్లగడ్డ – అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అభిమాన నేత భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు ఊర్లు ఊర్లే కదిలివచ్చాయి. ప్రియతమ నాయకుడు ఇక లేడని తెలిసి అభిమానుల కళ్లు చెమ్మగిల్లాయి. అన్న ఇక తిరిగి రాడని..ఆప్యాయ పలుకులు ఉండబోవని అనుచరులు కుమిలి కుమిలి ఏడ్చారు. నాన్నా..ఇక మాకెవరు దిక్కంటూ కుమార్తెలు అఖిల ప్రియ, నాగ మౌనిక రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ప్రజా నాయకుడిగా..సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా భూమా నిలిచిన తీరు నాయకగణం కీర్తించింది. ఆళ్లగడ్డలో సోమవారం నంద్యాల ఎమ్మెల్యే భూమా అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య కొనసాగాయి. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు, ముఖ్యనేతలు భూమా పార్థీవ శరీరంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. భూమా కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆళ్లగడ్డ: గుండె పోటుతో మృతి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సోమవారం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవను ప్రశంసించారు. అండగా నిలిచిన వారికోసం ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉండగా గుండెపోటు రావడంతో భూమా నాగిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. అభిమానుల సందర్శనార్థం భూమా పార్థీవ దేహాన్ని ఆళ్లగడ్డలోని ఆయన స్వగృహంలో ఉంచారు. భూమాకు నివాళులర్పించేందుకు సోమవారం ఉదయం నుంచే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. విగతజీవిగా ఉన్న ప్రియతమ నాయకుడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. జై భూమా.. భూమా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ జనసమూహం మధ్య భూమా పార్థీవ దేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి వైపీపీఎం కళాశాల, పాత బస్టాండు మీదుగా శోభా ఘాట్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ప్రియతమ నాయకుడిని కడసారి చూసుకునేందుకు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గం నుంచే కాక రాయలసీమ జిల్లాల్లోని అనేక ప్రాంతాలనుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీంతో భూమా గృహంతోపాటు ఆళ్లగడ్డలోని ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. నిబంధనల ప్రకారం పోలీస్ పరేడ్ నిర్వహించి, ఆకాశంలోకి తుపాకీతో కాల్పులు జరిపిన అనంతరం భూమా చితికి ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నిప్పటించారు. హాజరైన పలువురు నేతలు భూమా అంత్యక్రియలకు రాష్ట్రంలోని పలువురు నాయకులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఉపముఖ్యమంత్రులు కేయి కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వర రావు, పీతల సుజాత, పరిటాల సునీత, అచ్చన్నాయుడు, కర్నూలు ఎంపీ బుట్టారేణుక, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, స్పీకర్ కోడెల శివప్రసాదు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి.. తదితరులు భూమా నాగిరెడ్డి మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
భూమాకు ప్రముఖుల నివాళి
-
భూమా నేత్రాలు దానం
నూనెపల్లె: నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందగా ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో నేత్రదానం చేసినట్లు ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.విజయ్‌భాస్కర్ రెడ్డి తెలిపారు. నేత్రదానం అనంతరం ఆదివారం ఆయన సురక్ష ఆసుపత్రిలో మాట్లాడారు. గతంలో రామకృష్ణా డిగ్రీ కళాశాలలో నేత్రదానం వారోత్సవాల్లో ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పాల్గొని తాను నేత్రాలను దానం చేస్తానని చెప్పారన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాలు సమర్పించారన్నారు. ఆ మేరకు ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ భూమా కుటుంబ సభ్యులతో ఈ విషయంపై చర్చించి నేత్రదానానికి ఒప్పించారన్నారు. భూమా మృతి తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు నేత్రాలు తీసుకున్నట్లు చెప్పారు. సేకరించిన కళ్లను హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి పంపుతామన్నారు. నేత్రాలను ఆళ్లగడ్డ, కర్నూలు ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, ఎస్.వి.మోహన్‌రెడ్డి, కుమార్తె నాగ మౌనికలు డాక్టర్ విజయ భాస్కర్‌రెడ్డికి అందజేశారు. -
మూగబోయిన ఆళ్లగడ్డ
జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో ఆళ్లగడ్డ మూగబోయింది. మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూమా శోభానాగిరెడ్డి మృతిని మరిచిపోకముందే భూమా అనుచరులు, అభిమానులకు మళ్లీ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆళ్లగడ్డలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు ఆయన భౌతికఖాయాన్ని తీసుకొచ్చారు. ఆయన మరణవార్త తెలుసుకున్న నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాననేత విగతజీవిగా ఉండటాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. - ఆళ్లగడ్డ నివాళ్లుర్పించిన ప్రముఖులు భూమా నాగిరెడ్డి మృత దేహాన్ని సందర్శించి పలువురు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ నారా లోకేష్, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చంనాయుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, గౌరు చరితారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి. వైఎస్ఆర్సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి, తాడిపత్రి ఇన్చార్జ్ పెద్దిరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. భూమా నాగిరెడ్డి స్వగృహం దగ్గర జిల్లా ఎస్పీ రవికృష్ణ, ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రత్యేక పోలీసు బలాగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
విజయ డెయిరీ చైర్మన్‌గా భూమా నారాయణరెడ్డి
- 23వ సారి ఏకగ్రీవంగా ఎన్నిక నంద్యాలరూరల్: జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సమితి (విజయడెయిరీ) అధ్యక్షునిగా 23వ సారి భూమా నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నంద్యాల విజయ డెయిరీ పరిపాలన భవనంలో ఈ ఎన్నిక జరిగింది. ఏటా మూడు డైరెక్టర్ స్థానాలకు రొటేషన్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎం.కృష్ణాపురం పాల కేంద్రం అధ్యక్షుడిగా బాలీశ్వరరెడ్డి, శిరివెళ్ల పాలకేంద్రం అధ్యక్షుడిగా సుబ్బరాయుడు, సంజామల పాల కేంద్రం అధ్యక్షుడిగా రామకృష్ణుడు నామినేషన్లను దాఖలు చేయగా వీరికి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి హరిబాబు ప్రకటించారు. అనంతరం కొత్త డైరెక్టర్లతో పాటు మిగతా డైరెక్టర్లు సమావేశమై.. భూమా నారాయణరెడ్డిని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017–18సంవత్సరానికి 331లక్షల లీటర్ల పాల సేకరణ, 380లక్షల లీటర్ల పాల అమ్మకాల లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2015–16లో 294లక్షల లీటర్ల పాల సేకరణ చేశామని, 378లక్షల లీటర్ల పాలు అమ్మకం జరిపి రూ.181కోట్ల వ్యాపారం చేశామన్నారు. గత ఏడాది పాల దిగుబడి పెంపునకు, సాంకేతిక వనరుల కోసం రూ.48.83లక్షలు ఖర్చు చేశామని, ఈ ఏడాది రూ.80.33లక్షలు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. విజయ డెయిరీ ఎండీ ప్రసాదరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి, మార్కెటింగ్ డీజీఎం సుబ్రమణ్యం, ప్లాంట్ డీజీఎం శంకర్‌రెడ్డి, ప్రొటెక్షన్ డీజీఎం వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్యాంసన్‌బాబు, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు. -
భూమా బంధువుల దౌర్జన్యం
బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ - జేసీ2కు ఫిర్యాదు – మీకోసంకు వెల్లువెత్తిన వినతులు కల్లూరు (రూరల్): ఆళ్లగడ్డ మండలం పి. చింతకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1562, 1564లో దళితులు సాగుచేసుకుంటున్న ఏడబ్ల్యూ ల్యాండ్‌ను అధికారపార్టీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బంధువులు భూమా రుద్రారెడ్డి, గనిశ్రీను మరికొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సైతం తీసుకెళా్లను. మీరైనా స్పందించి రెవెన్యూ రికార్డులోని ఆర్ఓఆర్లో ఉన్న దళితుల భూములను కాపాడి బాధితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి డాలు రత్నమయ్య జిల్లా అధికారులకు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి జేసీ సి. హరికిరణ్, జేసీ2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ వినతులు స్వీకరించారు. అందులో.. – సర్వే నంబర్ 367/ఏ లోని ఎకరన్నర పొలాన్ని సర్వే చేయాలని ఏడు నెలలుగా వెల్దుర్తి తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వి. తిమ్మయ్య శెట్టి జేసీకి ఫిర్యాదు చేశారు. – డోన్ మండలం కమలాపురం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ ఆర్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్ఎస్ రామకృష్ణారెడ్డి తదితరులు అధికారులకు విన్నవించారు. – కొర్రబియ్యం విక్రయానికి కలెక్టరేట్ ఆవరణం, సీ క్యాంపు రైతు బజార్లో షాపు కేటాయించాలని తెర్నేకల్లు వాసులు నాగభూషణం, జనార్దన్ కోరారు. – పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని తమదంటూ చాకలి శేషన్న కుమారుడు చిన్న నరసింహులు దౌర్జన్యం చేస్తున్నాడని మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన నల్లబోతుల బోడెన్న తెలిపారు. – పగిడ్యాల మండలం ప్రాతకోట, వనములపాడు, నందికొట్కూరు మండలం 10 బొల్లవరంలో డీలర్ల నియామకానికి నిర్వహించిన రాతపరీక్షలో ముగ్గురు ఎంపికయ్యారని. అయితే వారిని కాదని ఇతరులకు రేషన్‌షాపులు కట్టబెట్టారని కొందరు జేసీని కలిసి ఫిర్యాదు చేశారు. – గ్రూపు 2, 3 పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్య వేదిక నాయకులు తగ్గుపర్తి రామన్న, మహరాజ్, రాము, మల్లేష్, దివాకర్, వలి, సోము, ప్రసాద్, రాజేష్, దాసు జేసీకి ఫిర్యాదు చేశారు. పరిహారం ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండి – రక్షణ శాఖకు కేటాయించనున్న ఓర్వకల్లు మండలం పాలకొలనులోని సర్వే నంబర్లు 99, 232,235, 250,252, 250లలోని 186 ఎకరాల భూమికి ఎకరాకు రూ.1.80లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని జేసీ హరికిరణ్ బాధిత రైతులకు వెల్లడించారు. తాము అందుకు అంగీకరించమని భూములు కోల్పోయే రైతులు సుధాకర్‌రెడ్డి మరికొందరు మీకోసం కార్యక్రమంలో జేసీని విన్నవించారు. ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని అరెస్ట్ చేసి లోపలేయండని స్థానిక పోలీసులకు ఆదేశించారు. దీంతో బాధితులు, జేసీ మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్పమాలలో ఉన్న తనను కనీస మర్యాద లేకుండా జేసీ మాట్లాడుతున్నారని, వారికి భయపడి భూములు అప్పగించే ప్రసక్తే లేదని సుధాకర్‌రెడ్డి చెప్పారు. -
బహిరంగ విమర్శలు మానుకోండి
– భూమా, శిల్పాల మధ్య రాజీకి అచ్చెన్న యత్నం – నాలుగు నియోజకవర్గాల్లో విభేదాలు వాస్తవమే కర్నూలు/నంద్యాల: పార్టీకి నష్టం కలిగించేలా బహిరంగ విమర్శలు మానుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, పార్టీ ఇన్చార్జి శిల్పా మోహన్‌రెడ్డిలకు జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. టీడీపీ జన చైతన్యయాత్ర కార్యక్రమాల్లో భాగంగా బేతంచెర్ల, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన ఆదివారం రాత్రి నగరంలోని మౌర్యా ఇన్‌లో బస చేశారు. సోమవారం ఉదయం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణి రెడ్డి, ఆయన సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు ఏవీ సుబ్బారెడ్డిని పిలిపించి రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. పార్టీ మారినప్పటి నుంచి భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డిలు పరస్పరం దూషించుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఇరువురినీ పిలిపించి రాజీ చేసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గీయులు బహిరంగ విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని నచ్చజెప్పినట్లు సమాచారం. ఇరువురి మధ్య సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని.. లేదా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై పరిష్కరించుకోవాలని సూచించారు. గోడదూకిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉన్న మాట వాస్తవమేనని ఈ సందర్బంగా మీడియాతో ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు అంగీకరించారు. కోడుమూరు, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జనచైతన్య యాత్ర కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహించుకుంటున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకురాగా వాస్తవమేనని.. త్వరలో అవన్నీ పరిష్కారం అవుతాయన్నారు. -
తహశీల్దార్‌పై భూమా వర్గీయుల దాడి
– భూములు ఆన్లైన్ చేయలేదని టీడీపీ వర్గీయులు నిలదీత – వీఆర్వోను కలవాలని తహశీల్దార్ సూచన – మాటామాటా పెరిగి పేపర్వెయిట్తో దాడి చేసిన వైనం చాగలమర్రి: అధికార పార్టీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఓ వైపు అధికార యంత్రాంగాన్ని భయబ్రాంతులకు గురి చేస్తూ.. వారి ఆకృత్యాలను ఎదురించే ప్రతిపక్ష పార్టీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తూ బరితెగిస్తున్నారు. అధికారులపై దాడులు చేయడం తమకు కొత్తమి కాదన్నట్లు తెలుగు దేశం నాయకులు (భూమా వర్గీయులు) తాజాగా చాగలమర్రి తహశీల్దార్‌పై దాడి చేశారు. మండలంలోని చక్రవర్తులపల్లె, గొడిగెనూరు గ్రామాలకు చెందిన భూమా వర్గానికి చెందిన కొందరు తమ పొలాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కొన్నాళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చక్రవర్తులపల్లె గ్రామానికి చెందిన నరసింహారెడ్డితో పాటు మరో ముగ్గురు రైతులు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తమ భూములను ఆన్లైన్లో ఎందుకు నమోదు చేయడం లేదని తహశీల్దార్ ఆంజనేయులను నిలదీశారు. పొలాలకు సంబంధించిన సమస్యపై వీఆర్వోను కలవాలని సూచించారు. తమ భూములు చిన్నబోధనం గ్రామ పరిధిలో ఉండటంతో ఆ వీఆర్వో ప్రస్తుతం మారి పోయాడని చెప్పారు. వెంటనే నరసింహారెడ్డి బదిలీపై వెళ్లిన వీఆర్వోతో ఫోన్లో మాట్లాడుతుండగా బయటకు వెళ్లి మాట్లాడమని తహశీల్దార్ సూచించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. టేబుల్‌పై ఉన్న పేపర్ వెయిట్‌తో తహశీల్దార్ తలపై నరసింహారెడ్డి దాడి చేశాడు. కార్యాలయంలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వెంటనే అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. గాయపడిన తహశీల్దార్‌ను ఆసుపత్రికి తరలించారు. జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు బాబులాల్, వీఆర్ఓలు, తలారీలు, డీలర్లు, వివిధ శాఖల అధికారులు ఆసుపత్రికి చేరుకొని తహశీల్దార్‌ను పరామర్శించారు. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మొహన్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరకేసు!
ఆశల పల్లకీలో భూమా – టీడీపీలో చిచ్చురేపుతున్న మంత్రి పదవి – కష్టమేనంటున్న వ్యతిరేక వర్గం – రౌడీషీట్ చుట్టూ రాజకీయం – తెరపైకి తెలంగాణ వ్యవహారం – రోజురోజుకు ముదురుతున్న వివాదం – ఆసక్తికరంగా మారిన చర్చ సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో పదవుల పందేరం కాస్తా మరోసారి చిచ్చురేపుతోంది. తమ నేతకు మంత్రి పదవి దక్కుతుందంటూ భూమా నాగిరెడ్డి అనుచరులు వాదిస్తుండగా.. అదేమీ లేదని మరో వర్గం పేర్కొంటోంది. మంత్రి పదవి ఇవ్వడంలో భాగంగానే రౌడీషీట్ ఎత్తివేసే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతోంది. అయితే.. అదేమీ లేదని మరో వర్గం కొట్టి పాడేస్తోంది. ఇందుకోసం వీరు తెలివిగా తెలంగాణలో తలసానికి మంత్రి పదవి ఇవ్వడంపై జరిగిన గొడవను తెరమీదకు తీసుకొస్తున్నట్లు సమాచారం. అలా.. పార్టీ మారినప్పటికీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెబుతున్నారు. దసరా తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ నేపథ్యంలో జిల్లాలో ఈ చర్చ కాస్తా ఆసక్తికరంగా మారింది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా భూమాకు మంత్రి పదవి అప్పగించే విషయంలో అధికార పార్టీలోని నేతలే కొత్త చర్చను లేపుతున్నారు. ఒకపార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారిన తర్వాత.. కనీసం పదవులకు రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చారని పక్క రాష్ట్రంలో మన పార్టీనే గోల చేస్తున్న విషయాన్ని వీరు పేర్కొంటున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారంలో మనమే రచ్చ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అదే తరహాలో పార్టీ మారిన వ్యక్తికి మంత్రి పదవి అప్పగిస్తే పార్టీ వాదనకు ఏం బలం ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా మంత్రి తలసాని వ్యవహారంలో ఏకంగా గవర్నర్ వ్యవస్థనూ కించపరిచిన నేపథ్యంలో ఇక్కడ పార్టీ మారిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే.. అదే గవర్నర్‌ను ప్రమాణ స్వీకారం చేయించాలని కోరేందుకు తమకు మోహం ఎలా వస్తుందని అంటున్నారు. ఈ చర్చ అధికార పార్టీ నేతలతో పాటు అధినేతను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. రౌడీషీట్ ఎత్తేస్తారా? అసలు రౌడీషీట్ ఎత్తివేసే విషయంలోనే అధికార పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదంత సులువైన వ్యవహారమేమీ కాదనే వాదన వినిపిస్తోంది. కేవలం ఆయన పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి అభిప్రాయం తెలపాలని మాత్రమే జిల్లా పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి లేఖ వచ్చిందని ఆయన వ్యతిరేక వర్గం వాదిస్తోంది. అయితే, అసలు మంత్రి పదవి వరించేందుకు ముందుగానే రౌడీషీట్ ఎత్తివేస్తారని భూమా అనుచరులు బలంగా పేర్కొంటున్నారు. మొత్తం మీద మంత్రిపదవుల వ్యవహారం కాస్తా జిల్లాలో మరోసారి ఇరువర్గాల మధ్య ఆసక్తికర పోరుకు తెరలేపినట్లు తెలుస్తోంది. -
ప్రత్యేక హోదా డిమాండ్ వినపడటంలేదా?
-
అమ్మ ఆశయాలు నెరవేరుస్తా..
-
సమైక్యాంద్రకోరుతూ భూమా నాగిరెడ్డి దీక్ష