మూగబోయిన ఆళ్లగడ్డ | allagadda Dumbfound | Sakshi
Sakshi News home page

మూగబోయిన ఆళ్లగడ్డ

Published Mon, Mar 13 2017 12:47 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

allagadda Dumbfound

జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో ఆళ్లగడ్డ మూగబోయింది. మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూమా శోభానాగిరెడ్డి మృతిని మరిచిపోకముందే భూమా అనుచరులు, అభిమానులకు మళ్లీ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆళ్లగడ్డలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు ఆయన భౌతికఖాయాన్ని తీసుకొచ్చారు. ఆయన మరణవార్త తెలుసుకున్న నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాననేత విగతజీవిగా ఉండటాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. 
- ఆళ్లగడ్డ
 
నివాళ్లుర్పించిన ప్రముఖులు  
భూమా నాగిరెడ్డి మృత దేహాన్ని సందర్శించి పలువురు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ నారా లోకేష్, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చంనాయుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, గౌరు చరితారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి. వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి, తాడిపత్రి ఇన్‌చార్జ్‌  పెద్దిరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.  భూమా నాగిరెడ్డి స్వగృహం దగ్గర జిల్లా ఎస్పీ రవికృష్ణ, ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రత్యేక పోలీసు బలాగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement