
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనికతో ఇటీవలె ఏడుడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మోహన్‌బాబు 71 జన్మదిన వేడుకలు తిరుపతిలో జరగ్గా, మనోజ్ తన భార్య మౌనికతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మనోజ్ ఎమోషనల్‌గా ప్రసంగించారు. ''జీవితంలో గెలుపోటములు సహజం. అందరి జీవితాల్లో ఏదో ఒక ఫేజ్‌లో అందకారం చుట్టేస్తోంది. నాకు కూడా గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ నాకు అండగా నిలబడింది. ఆ చీకటి కమ్ముకున్నప్పుడు వెలుతురులా మౌనిక కనిపించింది.
ప్రతి మగాడి గెలుపు వెనుకాల ఆడవారు ఉంటారు. ఆడవారి విజయం వెనుక కూడా మగాళ్లు ఉండాలి'' అంటూ మనోజ్ పేర్కొనగా ఆ మాటలకు మౌనిక సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment