
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు గత నెలలో ఒక్కటయ్యారు. 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో తమ బంధాన్ని పదిల పర్చుకున్నారు.
ఇక మనోజ్ తొలిసారిగా తన భార్య మౌనికను ఓ టాక్ షోకి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా తమ ప్రేమ, పెళ్లి వరకు సాగిన మానసిక సంఘర్షణలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే మౌనిక రెడ్డి తొలిసారిగా భర్త మంచు మనోజ్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మనోజ్‌తో పోలిస్తే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని మౌనిక పెళ్లి ఫోటోలను ఇంతవరకు బయటపెట్టలేదు. తాజాగా ఓ టాక్ షోకి హాజరైన నేపథ్యంలో ఇద్దరూ దిగిన ఫోటోను తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో పంచుకుంది. ఇక ఇందులో మౌనిక సెలబ్రిటీ స్టైలిస్ట్ సబ్యసాచి శారీను ధరించింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment