Manchu Manoj Shares Emotional Moments with Bhuma Mounika Reddy - Sakshi
Sakshi News home page

Manchu Manoj: ఆమె కోసం సినిమాలను కూడా వదిలేద్దామనుకున్నా: మనోజ్

Published Sat, Apr 22 2023 1:04 PM | Last Updated on Sat, Apr 22 2023 2:19 PM

Manchu Manoj Shares Emotional Moments with Bhuma Mounika Reddy - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనికతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో మంచు లక్ష్మీ నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను కూడా మనోజ్ అభిమానులతో పంచుకున్నారు.

అయితే వీరిద్దరి లవ్‌స్టోరిపై ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. అసలు వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఎక్కడ కలుసుకున్నారు? మనోజ్‌ ఫ్యామిలీకి, భూమా కుటుంబానికి మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది? అన్న విషయాల గురించి మంచు మనోజ్ ఇటీవల హాజరైన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

(ఇది చదవండి: ఓటీటీకి విరూపాక్ష.. స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ ఫిక్స్!)

మంచు మనోజ్ మాట్లాడుతూ.. 'మా కుటుంబాల మధ్య 15 ఏళ్లుగా  స్నేహం ఉంది. ఇరు కుటుంబాల సభ్యులు ఏ ఫంక్షన్‌ జరిగిన తప్పకుండా హాజరయ్యేవాళ్లం. అనుకోకుండా ఇద్దరికీ మరొకరితో పెళ్లి కావడంతో.. వేర్వేరు దారుల్లో వెళ్లిపోయాం. అయితే నాకు డైవర్స్ అయ్యాక ఇద్దరం కలిసి ప్రయాణించాలని అనుకున్నాం. అప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయి. నా కోసం ఓ బిడ్డతో ఎదురుచూస్తున్న అమ్మాయి కోసం సినిమాలను కూడా వదిలేసి వెళ్లాలని అనుకున్నా. ఆ సమయంలో నేను చేస్తున్న ఓ సినిమాను మధ్యలో వదిలేశా. మౌనికను తీసుకుని చెన్నై వెళ్లిపోయాను. చెన్నైలోనే ఏడాదికి పైగా సహజీవనం చేశాం. అయితే మేమిద్దరం చెన్నైలో ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదు' అని అన్నారు. ప్రస్తుతం మంచు మనోజ్- భూమా మౌనిక లవ్‌ స్టోరీకి సంబంధించిన ఆసక్తికర అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మంచు మనోజ్, భూమా మౌనికలు మార్చి 3న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement