టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు ఒక్కటయ్యారు. 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మనోజ్ తన పెళ్లికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఏం మనసో అంటూ' సాగే వీడియో సాంగ్‌తో పాటు మౌనికతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు మనోజ్.
మంచు మనోజ్ ట్వీట్‌లో రాస్తూ.. 'ఇలాంటి ప్రేమ జీవితంలో ఎవరికైనా ఒక్కసారే దక్కుతుంది. నువ్వు నా కోసమే పుట్టావని నాకు తెలుసు. నేను ఇప్పటికీ, ఎప్పటికీ నీ వాడినే. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ వారి పెళ్లికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. మనోజ్, మౌనిక పెళ్లివేడుకను వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశాడు. ట్వీట్‌తో పాటు ఇద్దరు కలిసి ఉన్న అరుదైన ఫోటోను పంచుకున్నారు. మౌనిక వైపు తన చేతులు చూపిస్తూ నవ్వుతున్న ఫోటో చూస్తే చూడముచ్చటగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
"THEY SAY THIS KIND OF LOVE IS ONCE IN A LIFETIME, AND I KNOW YOU ARE THE ONE FOR ME. I OFFER YOU ALL
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 18, 2023
OF ME TODAY AND FOR ALWAYS. THANK YOU FOR SHOWING
ME HOW IT FEELS TO BE LOVED" @BhumaMounika 💓
▶️ https://t.co/BeOXs0pJ5n pic.twitter.com/ctcK8WqSDK
Comments
Please login to add a commentAdd a comment