మంచు మనోజ్-విష్ణు మధ్య తలెత్తిన వివాదం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇంత వరకు గుట్టుగా ఉన్న మంచు వారి విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. విష్ణు తన ఇంటికి వచ్చి అనుచరులను ఇలా కొడతాడు అంటూ మనోజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు మోహన్ బాబు చొరవతో మనోజ్ ఆ వీడియోను వెంటనే తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
దీంతో వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.తాజాగా మంచు బ్రదర్స్ మధ్య నెలకొన్న వివాదంపై మంచు లక్ష్మీ స్పందించింది. ఇది ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవగానే పరిగణించాలని, దీనిపై అనవసరంగా రచ్చ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఇద్దరి మధ్య వివాదం త్వరగానే పరిష్కారమవుతుందని, విషయం పూర్తిగా తెలియకుండా ఇష్టమొచ్చినట్లు వార్తలు ప్రచారం చేయొద్దని కోరింది.
గతంలో కూడా మంచు ఫ్యామిలీలో నెలకొన్న గొడవలపై లక్ష్మీ స్పందిస్తూ.. 'మా నాన్న చాలా స్క్రిక్ట్. ఏదైనా గొడవ జరిగితే, అందరిని పిలిచి మాట్లాడతారు. ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు సర్వసాధారణం. ప్రతీది బయటికి వచ్చి చెప్పుకోలేం కదా. ఇంటి పేరు పరువు ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం ప్రతి చిన్న గొడవకు బయటకు రాలేము' అంటూ ఆమె గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment