మంచు కుటుంబంలో విభేదాలు ఉన్నాయనేది ఇటీవల మనోజ్ రిలీజ్ చేసిన వీడియోతో స్పష్టమైంది. మనోజ్ అనుచరుడు సారథి ఇంట్లోకి చొరబడిన విష్ణు అతడిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత మోహన్‌బాబు కల్పించుకోవడంతో మనోజ్ వీడియో డిలీట్ చేయడం, ఇదంతా చాలా చిన్న గొడవ అని విష్ణు చెప్పడం తెలిసిందే!
అయితే ఈ గొడవంతా నిజం కాదు ప్రాంక్ అని చెప్పకనే చెప్తూ విష్ణు మార్చి 30న ఓ వీడియో షేర్ చేశాడు. హౌస్ ఆఫ్ మంచూస్ పేరిట తమ సొంత బ్యానర్‌లో ఓ రియాలిటీ షో రాబోతుందని చెప్పాడు. కానీ లక్ష్మి, మనోజ్ మాత్రం ఈ రియాలిటీ షో ట్రైలర్ షేర్ చేయలేదు. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఇదంతా ప్రాంక్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. రియాలిటీ షోలో భాగంగానే మంచు బ్రదర్స్ గొడవపెట్టుకున్నారా? ఇదేదో తేడాగా ఉంది అని రకరాలుగా కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా ఈ వ్యవహారంపై మంచు మనోజ్, లక్ష్మి స్పందించినట్లు తెలుస్తోంది. హౌస్ ఆఫ్ మంచూస్ రియాలిటీ షో గురించి మంచు లక్ష్మి దగ్గర ప్రస్తావించగా.. తను ఎటువంటి రియాలిటీ షో చేయడం లేదని కుండబద్ధలు కొట్టిందట. అటు మనోజ్ టీమ్ కూడా ఈ వార్తలను తోసిపుచ్చినట్లు కనిపిస్తోంది.
'ఆరోజు సారధి ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు సారధి భార్య ఫోన్ చేస్తే మనోజ్ అక్కడికి వెళ్లాడు. అంతేకానీ షూటింగ్ కోసం వెళ్లలేదు. తను ఎటువంటి రియాలిటీ షో చేయడం లేదు. ప్రస్తుతం అతడు తన పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉన్నాడు' అని మనోజ్ టీమ్ మెంబర్ ఒకరు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన జనాలు కొత్తగా ఇదేం ట్విస్ట్ అని ముక్కున వేలేసుకుంటున్నారు. అంటే ఆ రియాలిటీ షో నిజమేనా? లేదంటే గొడవ కవర్ చేసుకోవడానికే విష్ణు తంటాలు పడుతున్నాడా? అని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment