టాలీవుడ్ సినీ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు ఫ్యామిలీలో విభేదాలు రావడంతో మనోజ్, మౌనికల నుంచి తనకు ప్రాణహాణి ఉందని మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మనోజ్‌పై క్రైం నెంబర్ 644/2024 కింద 329,351,115 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో విజయ్‌రెడ్డి, కిరణ్‌లపై కేసు నమోదైంది.
విదేశాల నుంచి తిరిగొచ్చిన విష్ణు
కుటుంబంలో వివాదాలు జరుగుతుండటంతో మంచు విష్ణు కొంత సమయం క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి చేరకున్న మోహన్‌బాబు.. విష్ణుతో కలిసి ఒకే కారులో జల్‌పల్లిలోని నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో కూడా వారు పూర్తి భద్రత సిబ్బంది మధ్య వెళ్లడం గమనార్హం. ఆపై కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.కుటుంబ వ్యవహారాన్ని పెద్దగా చిత్రీకరించడం సరికాదని విష్ణు తెలిపారు. త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.
మోహన్ బాబు ఫిర్యాదు తర్వాత మనోజ్ పత్రికా ప్రకటన చేశారు. 'నాపై, నా భార్య మౌనికపై నా తండ్రి డాక్టర్ ఎం. మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన, తప్పుడు ఆరోపణలు నాకు చాలా బాధ కలిగించింది. నా తండ్రి చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవాలు. నా పరువు తీయడానికి, నా గొంతును నొక్కడానికి,కుటుంబ కలహాలు సృష్టించడానికి ఉద్దేశపూర్వక చేసే ప్రయత్నంలో ఇదొక భాగం. నాకు, నా భార్యకు వ్యతిరేకంగా ఆయన చేసిన వాదనలు పూర్తిగా కల్పితం. అంటూ మనోజ్ కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment