Manchu Manoj And Manchu Vishnu Fight Becomes Viral In Social Media, Know Details Inside - Sakshi
Sakshi News home page

Manchu Manoj-Manchu Vishnu : రెండేళ్లుగా మంచు బ్రదర్స్‌ మధ్య మనస్పర్థలు.. పెళ్లి తర్వాత మరింత ముదిరిన వివాదం

Published Fri, Mar 24 2023 1:18 PM | Last Updated on Fri, Mar 24 2023 3:24 PM

Manchu Manoj And Manchu Vishnu Fight Becomes Viral In Social Media - Sakshi

మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చకెక్కాయి. మంచు విష్ణు-మనోజ్‌ల మధ్య చాలాకాలంగా ఉన్న వివాదం ఇప్పుడు రోడ్డునపడింది. కొన్నాళ్లుగా మనోజ్‌-విష్ణుకి మధ్య సరిగా మాటలు లేవని ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో గట్టిగానే టాక్‌ వినిపించింది. విష్ణు బర్త్‌డే రోజు మనోజ్‌ ప్రత్యేకంగా విషెస్‌ చెప్పినా ఆయన స్పందించలేదు. దీనికి తోడు మనోజ్‌ పెళ్లిలో విష్ణు అంటీముట్టనట్లు వ్యవహరించడం, ఏదో అతిథిలాగా కాసేపు ఉండి వెంటనే వెళ్లిపోవడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. చదవండి:  మనోజ్‌ పెళ్లి వేడుకలో విష్ణు చేసిన పనికి షాక్‌ అవుతున్న నెటిజన్లు

రీసెంట్‌గా మోహన్‌ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. మనోజ్‌-విష్ణులు ఒకే స్టేజ్‌పై ఉన్నా పలకరించుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తలకు మరింత బలం చేకూరిస్తూ తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మనోజ్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటున్న సారథి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి  విష్ణు గొడవపడటం, ఆ వీడియోను స్వయంగా మనోజ్‌ షేర్‌ చేయడంతో ఇప్పుడీ విషయం రచ్చకెక్కింది. 

అప్పటినుంచే విబేధాలా?
ఇక నిజానికి రెండేళ్ల క్రితం నుంచే అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. మనోజ్‌ రెండో పెళ్లి తర్వాత  ఇద్దరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరాయట. అ‍ప్పటి నుంచి అంటీముట్టనట్లుగా ఉన్న విష్ణు తాజాగా మనోజ్‌ అనుచరుడిపైనే దాడికి పాల్పడటంతో మనోజ్‌ ఈ వ్యవహారాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం మోహన్‌ బాబు ఈ గొడవకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఇద్దరినీ కలిపి మాట్లాడనున్నారట. చదవండి:  వీడియో షేర్‌ చేసిన మనోజ్‌.. సీరియస్‌ అయిన మోహన్‌బాబు

మనోజ్‌-విష్ణులు సొంత అన్నదమ్ములు కాదా?
మంచు మనోజ్- మంచు విష్ణులు నిజానికి సొంత అన్నదమ్ములు కాదు. మోహన్‌ బాబు మొదటి భార్య విద్యాదేవికి విష్ణు, లక్ష్మీలు సంతనం. అనారోగ్యంతో ఆమె కన్నుమూయడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన మోహన్‌బాబును కుటుంబసభ్యులు ఒప్పించి విద్యాదేవి సొంత చెల్లెలు నిర్మాలా దేవితో రెండో వివాహం జరిపించారు. వీరి సంతానమే మంచు మనోజ్‌. అయితే ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మంచు లక్ష్మీ-మనోజ్‌లు చాలా క్లోజ్‌గా ఉండేవారు.

మనోజ్‌ను తమ్ముడిలా కాకుండా సొంత కొడుకులా చూసుకుంటానని స్వయంగా లక్ష్మీ పలు సందర్బాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మనోజ్‌ పెళ్లి కూడా లక్ష్మీనే దగ్గరుండి జరిపించింది. మరి ఇప్పుడు రచ్చకెక్కిన అన్నదమ్ముల గొడవను లక్ష్మీ ఎలా పరిష్కరిస్తుందన్నది చూడాల్సి ఉంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement