Big Twist in Manchu Vishnu-Manoj Fight, Check Full Details Inside - Sakshi
Sakshi News home page

Manchu Vishnu- Manoj : మంచు విష్ణు-మనోజ్‌ల గొడవలో ట్విస్ట్‌.. ఇంకేం చూడాల్సి వస్తుందో

Published Thu, Mar 30 2023 6:58 PM | Last Updated on Thu, Mar 30 2023 7:16 PM

Big Twist in After Manchu Manoj Vishnu Fight, Check Truth Inside - Sakshi

మంచు ఫ్యామిలీలో కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా వినిపించింది. దీనికి తోడు మొన్నటికి మొన్న విష్ణు-మనోజ్‌లు బాహాటంగానే గొడవ పడిన వీడియో నెట్టింట ఎంతలా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచుమనోజ్‌ సోదరుడు సారథి ఇంట్లోకి చొరబడి అతనిపై విష్ణు చేయిచేసుకున్న వీడియో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ తర్వాత మోహన్‌ బాబు ఎంట్రీతో వీడియో డిలీట్‌ చేయడం, ఆ తర్వాత మనోజ్‌, విష్ణుల కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి.

అయితే విష్ణు-మనోజ్‌ల గొడవలో ఇప్పుడొక ట్విస్ట్‌ బయటకు వచ్చింది. ఏప్రిల్‌ నెల రాకుండానే జనాలను పిచ్చోళ్లను చేశారు మంచు బ్రదర్స్‌. అందరూ అనుకున్నట్లు వాళ్లేమీ గొడవపడలేదట. ఇదంతా ఓ రియాలిటీ షో కోసం చేస్తున్న ప్రాంక్‌ వీడియోనట. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు బయటపెట్టాడు. తమ సొంత బ్యానర్‌లో ఓ రియాలిటీ షోను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికి 'హౌస్‌ ఆఫ్‌ మంచూస్‌'(House Of Manchs)అని పేరు కూడా పెట్టారు.

త్వరలోనే ఓటీటీ వేదికగా ఈ రియాలిటీ షోను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు విష్ణు తెలిపారు. దీంతో 'అన్నా ట్విస్ట్‌ అదిరింది.. మంచు ఫ్యామిలీ అంటే ఆమాత్రం ఉంటుంది' అంటూ నెటిజన్లు విస్తుపోతున్నారు. మరోవైపు నిజంగానే రియాలిటీ షో చేస్తున్నారా? లేక ఆల్రెడీ వీడియో వైరల్‌ అయ్యి పరువు బజారున పడటంతో ఇలా కవర్‌ డ్రైవ్‌ చేస్తున్నారా అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement