ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి. చిన్నకొడుకు మనోజ్.. తండ్రిపై కేసు పెట్టడం, మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి తలుపులు తోసుకుని మరీ లోపలికి వెళ్లడం.. ఈ క్రమంలో జర్నలిస్టులతో మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించడం. కాసేపటికే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరడం.. ఇలా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి.
(ఇదీ చదవండి: నటుడు మోహన్ బాబు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?)
ప్రస్తుతానికి మీడియాలో మనోజ్ కనిపిస్తున్నాడు. మరోవైపు మోహన్ బాబు మాత్రం ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు తమ కుటుంబంలో జరుగుతున్న రచ్చపై మంచు విష్ణు స్పందించాడు. తండ్రికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న ఆస్పత్రి నుంచే మీడియాతో మాట్లాడాడు. ఇలాంటి పరిస్థితి తన కుటుంబానికి వస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
(చదవండి: ఆ విషయంలో సీపీకి హామీ ఇచ్చా: మంచు మనోజ్)
'ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందని ఊహించలేదు. మూడు తరాలుగా నాన్నగారు ఏంటనేది మీకు తెలుసు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సాధారణమే. అవి పరిష్కారమవుతాయని పెద్దలు కోరుకుంటారు. నేను ఎమోషనల్ పెయిన్‌ఫుల్‌గా ఉన్నాను. మా నాన్న చేసిన తప్పు మమల్ని విపరీతంగా ప్రేమించటం. మీడియా వారు.. మీకు కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి. కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు'
'మా అమ్మ బాధలో ఉంది. నాన్నకు దెబ్బలు తగిలాయి. లాస్ ఏంజెల్స్‌లో 'కన్నప్ప' మూవీ పనుల్లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసింది. దీంతో అన్నీ వదిలి వచ్చేశాను. మీడియా వ్యకికి గాయాలు తగలటం బాధాకరం. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. మీడియా వారికి నమస్కరిస్తూ వచ్చారు. మోహం మీద ఏదో పెట్టారని.. అలా జరిగిపోయింది. గాయమైన వ్యక్తి కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. పోలీసులు మా కంటే ముందు మీడియాకు లీక్ ఇస్తున్నారు. నోటీసులు ఈ రోజు 9:30కి జారీ చేశారు. దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను'
(ఇదీ చదవండి: మా నాన్న దేవుడు: మంచు మనోజ్)
'మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు. నాకు కలవాల్సిన అవసరం లేదు. కానీ వారిని గౌరవించి కలుస్తాను. ప్రేమతో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు. మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేదేం లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను. నేను ఇక్కడ ఉంటే ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. తమ్ముడు పెళ్లి శుభకార్యం.. బిడ్డను కన్నారు. దాని గురించి ఎవరు ఫీలవరు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయంకృషితో గొప్ప స్దాయికి ఎదిగారు. కుటుంబం పరంగా నాన్న ఏది అనుకుంటే అదే ఉండాలి'
'మీడియాలో కొందరు హద్దు మీరుతున్నారు. పబ్లిక్ ఫిగర్స్‌పై రిపోర్ట్ చేయటం మీడియా బాధ్యత. లోపల తండ్రి స్దాయి వ్యక్తి ఉంటే తలుపులు బద్దలు కొడతారా? మా కుటుంబంలో బయటి వ్యక్తులు ఇన్ వాల్వ్‌మెంట్ ఉంటే వారికి ఈవెనింగ్ దాకా సమయం ఇస్తున్నాం. లేదంటే అందరి పేర్లు నేనే బయడపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చెస్తాను. కానీ నా తమ్ముడిపై నేనిప్పుడు దాడులు చేయను. కాలమే అన్నింటికీ సమాధానాలు ఇస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఎడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు' అని విష్ణు తన ఆవేదనని బయటపెట్టారు.
(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)
Comments
Please login to add a commentAdd a comment