Manchu manojkumar
-
భార్యతో క్యూట్ వీడియోను షేర్ చేసిన మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో ఆయన వివాహం ఘనంగా జరిగింది.ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు గత నెలలో ఒక్కటైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే వీరి పెళ్లయి నేటికి సరిగ్గా నెలరోజులవుతుంది. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి ఓ క్యూట్ వీడియోను పంచుకున్నారు మనోజ్. దీనికి 'ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు' అంటూ క్యాప్షన్ ఇవ్వగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రియా ప్రియా చంపొద్దే అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇక సినిమాల విషయానికి వస్తే.. చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాల విషయంలోనూ జోరు పెంచారు మనోజ్. -
మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న భూమా మౌనికా రెడ్డి బ్యాగ్రౌండ్ ఇదే!
మంచు మనోజ్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాడు. గత కొద్దిరోజులుగా భూమా మౌనిక రెడ్డిని మనోజ్ వివాహం చేసుకోనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ మనోజ్ తన కాబోయే భార్యను పరిచయం చేశాడు. 'పెళ్లికూతురు భూమా మౌనిక'.. మనోజ్ వెడ్స్ మౌనిక అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు. దీంతో పలువురు అభిమానులు మనోజ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు మౌనిక రెడ్డి ఎవరనే విషయాలపై నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. దివంగత టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డి. పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా కుటుంబంతో మంచుఫ్యామిలీకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో మౌనిక రెడ్డికి 2016లో ఘనంగా వివాహం జరిగింది. వీరికి 2018లో ధైరవ్ రెడ్డి అనే కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఆ తర్వాత మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. అటు మనోజ్ కూడా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకోని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతకాలంగా మనోజ్- మౌనికల మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యారు. మంచు లక్ష్మీ ఇంట్లోనే ఈ రోజు(శుక్రవారం) రాత్రి 8.30 గంటలకు మనోజ్- మౌనిక వివాహం జరగనుంది. -
సంక్రాంతి సంబరాలు: రంకెలేసిన ఉత్సాహం
సాక్షి, చంద్రగిరి/వెదురుకుప్పం: మండలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగలో మూడో రోజైన గురువారం జిల్లాలోనే ఎడ్ల పందేల(జల్లికట్టు)కు ప్రసిద్ధి చెందిన రంగంపేట గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. వీక్షించడానికి మండలం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. దీంతో రంగంపేట గ్రామం జనసంద్రమైంది. గ్రామ ప్రారంభం నుంచి చివరి వరకు ఇసుకవేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. గ్రామంలోని పశువులను పందేలకు వదలడంతో యువకులు కేరింతలు కొడుతూ వాటిని నిలువరించేందుకు పోటీపడ్డారు. మహిళలు సైతం మేడలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. పశువులకు కట్టిన పలకలను సొంతం చేసుకునే ప్రయత్నంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. సుమారు 4 గంటల పాటు ఉల్లాసంగా జల్లికట్టు సాగింది. ఎడ్ల పందేలు తిలకించడానికి చెట్టు పైకి ఎక్కిన జనం పందేలను తిలకించిన మోహన్‌బాబు పశువుల పందేలను శ్రీవిద్యానికేతన్ అధినేత, సీనియర్ నటుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు, నటుడు మంచు మనోజ్ తిలకించారు. మోహన్‌బాబు పశువుల పందేలను తిలకించడానికి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. మాంబేడులో.. వెదురుకుప్పం మండలం మాంబేడులో జల్లికట్టు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు కోడెగిత్తలను నిలువరించడానికి ఉత్సాహం చూపారు. -
మోహన్‌బాబుకు మాతృవియోగం
ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం కన్ను మూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. లక్ష్మమ్మ భౌతికకాయాన్ని ఎ.రంగంపేట సమీపంలోగల శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు. విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ మరణవార్త తెలియగానే హుటాహుటిన ఇండియాకి బయలుదేరారు. ‘‘మా నానమ్మ లక్ష్మమ్మగారు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్సవుతాం నానమ్మా. ఈ సమయంలో మేం ఇండియాలో లేకపోవడం బాధ కలిగించింది. ఇది ఊహించని పరిణామం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని ట్వీటర్ ద్వారా మంచు మనోజ్ పేర్కొన్నారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం తిరుపతిలో జరుగుతాయి. సినీ నటి, ఎమ్మెల్యే రోజా లక్ష్మమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
విద్యకు కులం లేదు
యువతదంతా ప్రేమకులం ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ గుంటూరు రూరల్ : విద్యకు కులంలేదు, రక్తానికి కులం లేదు, మరి మనుషులకెందుకు ఈ వర్గ విభేదాలని ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. మండలంలోని చౌడవరం గ్రామంలో గల ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన 31వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రతి పని చేసేవారికి ఆ వర్గం చేసే పనిని తెలిపేందుకు కులాలను ఏర్పాటు చేశారని, కానీ నేడు అలాంటివి లేవని, అంతా ఒకటేనన్నారు. మనమంతా ప్రేమకులానికి చెందిన వారమని తెలిపారు. కష్టపడకుండా ఏదీ సాధ్యంకాదని ప్రతి విద్యార్థి తమ లక్ష్య సాధనకోసం రోజూ ఒక గంట కష్టపడితే తప్పని సరిగా లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. యువత నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి వారి తల్లిదండ్రుల గురించి ఆలోచించాలన్నారు. లక్ష్యసాధనకు పట్టుదల అవసరం ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడాలని, లక్ష్య సాధన కోసం పట్టుదలతో కృషిచేయాలని రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. యువత తమలో ఉన్న శక్తిని ఉపయోగించుకుని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. తెలివితేటలు, నైపుణ్యాలను పంచుకుంటూ, పెంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి నిజాయితీ, ఆత్మవిశ్వాసం, సత్ప్రవర్తన, సమాజంపై అవగాహన అనే లక్షణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి ఒక మేధావిగా తయారవ్వాలన్నారు. మంచు మనోజ్, ఉదయలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, కళాశాల అధ్యక్షుడు డాక్టర్ కె.బసవపున్నయ్య, కార్యదర్శి ఆర్.గోపాలకృష్ణ, కోశాదికారి ఎం.గోపాలకృష్ణ, ప్రిన్సిపల్ సుధాకర్, ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సెలబ్రిటీలకే సెలబ్రిటీలు!
ఫొటో స్టోరీ ‘వాటితో కొంతసేపు గడిపితే మన నేచర్ మారిపోతుంది. కొంత పెడితే సంతోషిస్తాయవి. మనుషులకే ఎంత పెట్టినా చాలదు...’ పెట్స్ గురించి, అంతర్లీనంగా మనుషుల గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఫిలాసఫీ ఇది. మనుషుల గురించి అందరికీ తెలుసు. పెట్స్ గురించి మాత్రం వాటితో గడిపినప్పుడే తెలుస్తుంది. అలా గడిపేవారికే పూరి ఫిలాసఫీలోని గాఢత అర్థం అవుతుంది. సెలబ్రిటీల జీవితంలో ఖరీదైన దుస్తులు, కార్లు, వాచీలు ఎలాగో... ఈ ఖరీదైన కుక్కపిల్లలు కూడా అలాగే! ఇంకా చెప్పాలంటే ఇవి ఆ సెలబ్రిటీలకే సెలబ్రిటీలు. ఇక్కడ ఈ సినిమా వాళ్ల గురించే కాదు... పెట్స్ గురించి కూడా చెప్పాలి. ఏ జాతివి అయితేనేం, ఏ దేశం నుంచి దిగుమతి చేసుకొన్నవైతేనేం... సృష్టిలో కెల్లా విశ్వాసం గలవి అనే జాతికి చెందినవి. తమను పెంచిపోషిస్తున్న వారిపై అపారమైన ప్రేమను కురిపిస్తాయి. పూరి జగన్నాథ్, మంచు లక్ష్మి, జయప్రద, మంచు మనోజ్‌కుమార్... తమ తమ పెట్స్‌తో మురిపెంగా ప్రేమాభిమానాలను పంచుకొంటున్నప్పుడు క్లిక్మనిపించినవి ఈ ఫోటోలు. ఇవి చాలు మూగజీవులతో అనుబంధం ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పడానికి!