కాశీలో...మహేశ్ | Mahesh Babu's Brahmotsavam moves to North India | Sakshi
Sakshi News home page

కాశీలో...మహేశ్

Published Tue, Mar 8 2016 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

కాశీలో...మహేశ్

కాశీలో...మహేశ్

 గత ఏడాది సాధించిన ‘శ్రీమంతుడు’ విజయం హీరో మహేశ్‌బాబులో కొత్త ఊపు తెచ్చింది. తాజాగా ‘బ్రహ్మోత్సవం’ పేరిట మరో కుటుంబ కథతో ఆయన సిద్ధమవుతున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల నిర్దేశకత్వంలో మరోసారి అలాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ సినిమాను ఈ సమ్మర్ స్పెషల్‌గా అందిస్తున్నారు.
 
 సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత - ఇలా ఒకరికి ముగ్గురు ఈ చిత్రంలో కథానాయికలు. సీనియర్ నరేశ్, సత్యరాజ్, జయసుధ, తులసి తదితరులు ముఖ్యపాత్రధారులు. పొట్లూరి వి. ప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. ‘‘ఇటీవల ఉదయ్‌పూర్ పరిసరాల్లో షూటింగ్ చేశాం. తాజాగా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ పరిసరాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం.
 
 ఈ నెల 13వ తేదీ వరకు ఈ పవిత్ర పరిసరా ల్లోనే షూటింగ్’’ అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ కాశీ షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా మిగతా సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. మిక్కీ జె. మేయర్ సంగీతంలో, షూటింగ్‌తో పాటు మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న వేసవి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement