మార్చి 3న ‘రిచి గాడి పెళ్లి’ | Richie Gadi Pelli Movie To Release On 3rd March | Sakshi

మార్చి 3న ‘రిచి గాడి పెళ్లి’

Feb 28 2023 6:21 PM | Updated on Feb 28 2023 6:21 PM

Richie Gadi Pelli Movie To Release On 3rd March - Sakshi

నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రిచి గాడి పెళ్లి’.  కెఎస్ హేమరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా  చిత్ర దర్శక, నిర్మాత కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ.. "రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం.  

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య  ఫోన్ లోజరిగే గేమ్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఆ ఆట వల్ల వారి  జీవితాల్లో ఎలాంటి  మార్పులు వచ్చాయి , ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం.  లిరిక్ రైటర్‌ అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” , శ్రీమణి, రాసిన నా నిన్నలలో కన్నులలో అనే పాటకు  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement