
హీరోయిన్ ప్రణీతకు గాయాలు
ఖమ్మం: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీతకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బైటపడింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఊపిరి పీల్చుకున్నారు. డైనమేట్ మూవీలో ఆమెతో కలిసి నటించిన హీరో మంచు విష్ణు ప్రమాదం విషయం తెలియగానే కాస్త కంగారుపడ్డాడు. హీరో నితిన్, మంచు విష్ణు, హీరోయిన్ ప్రణీతకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని పరామర్శించారు. చివరికి ఆమె చాలా సేఫ్ గా ఉందన్న వివరాలు తెలుసుకుని కాస్త రిలీఫ్ అయ్యారు. మరికొంత మంది సినీ ప్రముఖులు ప్రణీత సురక్షితంగా ఉందన్న వార్త తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు.
ఆమె ప్రయాణిస్తున్న కారు ఆదివారం ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు పల్టీలు కొట్టింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్వల్పంగా గాయపడిన ప్రణీతను మోతేలోని ఆస్పత్రికి తరలించారు. తాను క్షేమంగానే ఉన్నానని, షాక్ నుంచి ఇంకా బయటపడలేదని ట్వీట్ చేసింది. తమ సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపింది. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ట్విటర్ లో పోస్ట్ చేసింది.
బావ, అత్తారింటికి దారేదీ, డైనమైట్, రభస, పాండవులు పాండువులు తుమ్మెద తదితర చిత్రాల్లో ప్రణీత నటించింది. మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం'లో నటిస్తోంది. 'చుట్టాలబ్బాయి'లో ఆదితో జత కడుతోంది. తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఆమె నటించింది.
మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
While on our way back from kammam. perfectly fine but unable to come out of the shock pic.twitter.com/b7TXWnULgz
— Pranitha Subhash (@pranitasubhash) February 14, 2016
Big thankyou to the AEEs working on this road for calling the ambulance on time. My staff has survived injuries. But we are all safe.
— Pranitha Subhash (@pranitasubhash) February 14, 2016