ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
కట్టంగూర్/ ఖమ్మంమయూరిసెంటర్: శుభకార్యా నికి వెళ్లి వస్తూ ప్రమాదవ శాత్తూ కారు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురికి గాయాలయ్యా యి. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. నకిరేకల్ పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణం ఖిల్లాబజారుకు చెందిన మహ్మద్ సోహెల్.. తన సోదరి వలిమా ఫంక్షన్ (రిసెప్షన్)లో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు శనివారం సాయంత్రం ఎనిమిది మంది బంధువులను తీసు కొని ఇన్నోవా కారులో వెళ్లాడు.
ఫంక్షన్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఖమ్మంకు తిరిగి బయలుదే రారు. మార్గమధ్యలోని కట్టంగూర్ మండలం ఎర సాని గూడెం స్టేజీ వద్దకు రాగానే డ్రైవర్ అతివేగంగా నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టాడు. కారు అదుపు తప్పి హైవే పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టి పల్టీకొట్టింది. ప్రమాదంలో ఖమ్మం ఖిల్లాబజా ర్‌కు చెందిన మహమ్మద్ ఇమిదాద్(21), షేక్ సమీ ర్(21), షేక్ యాసిన్(18)లకు తీవ్రగాయాలై అక్క డికక్కడే మృతిచెందారు. డ్రైవర్ అర్షద్ అలీ, ఎస్‌కే కరీం, సల్మా న్‌లకు తీవ్ర గాయాలు కాగా ఎండీ.అత్తార్, ఆరీఫ్, సోహెల్‌కు స్వల్పగాయాలయ్యాయి. క్షత గాత్రుల ను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి, మృత దేహా లను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతులంతా నిరుపేదలే..: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకులూ నిరుపేద కుటుంబానికి చెందిన వారు. అవివాహితులైన వీరంతా ఖమ్మం పట్టణంలో టైల్స్‌వర్క్ చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మృతులకు సొంత ఇళ్లుకూడా లేని పరిస్థితి. వారి బంధువులు నకిరేకల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిరావటంతో రోదనలు మిన్నంటాయి. కాగా, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతులంతా పేద కుటుంబాల వారు అయినందున ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మైనార్టీ కార్పొరేషన్ రుణాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment