విదేశీ భామలా..
విదేశీ భామలా..
Published Tue, Jan 21 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
నటి ప్రణీత మోడ్రన్ భామనే. అయితే పాశ్చాత్య దేశాల భామలంత స్టైలిష్ అమ్మాయి కాదట. ప్రస్తుతం అలా మారే ప్రయత్నం చేసిందట. టాలీవుడ్‌లో అత్తారింటికి దారేది చిత్రంతో మంచి పాపులారిటీని పొందిన ఈ అమ్మడు తమిళంలోను శకుని లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. అయినా అంతగా పేరు పొందలేదు. అత్తారింటికి దారేది చిత్రం ఈమెకోదారి చూపిస్తుందని ఆశించింది. అయితే ఈ బ్యూటీ ఆశ ఫలించలేదు. దీంతో మళ్లీ మాతృ భాష కన్నడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం అక్క డ ఉపేంద్ర సరసన బ్రహ్మ అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ మలేషియాలో నివశించే కన్నడ భామ పాత్రను పోషిస్తోందట. ప్రణీత మాట్లాడుతూ తన తల్లిదండ్రులు వైద్యులని చెప్పింది. తనను డాక్టర్ గానో, ఇంజనీర్‌గానో చూడాలని ఆశపడ్డారని చెప్పింది. అయితే విధి తనను నటిని చేసిందని పేర్కొంది. పొరికి చిత్ర యూనిట్ తనను నటిగా పరిచయం చేయడానికి తన తల్లిదండ్రుల అనుమతి కోరిందని చెప్పింది. అలా నటిగా మారినట్లు చెప్పింది. ప్రస్తుతం కన్నడంలో ఉపేంద్ర సరసన విదేశాల్లో పెరిగిన భారతీయ యువతిగా నటిస్తున్నానని తెలిపింది. ఈ పాత్ర కోసం షూటింగ్‌కు ముందే మలేషియా వెళ్లి వారి నడవడికలను గమనించి బ్రహ్మ చిత్రంలో విదేశీ వనితగా జీవిస్తున్నట్లు పేర్కొంది.
Advertisement
Advertisement