కర్నూలు కళానికేతన్ అదుర్స్ | kalanikethan adhurs in kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలు కళానికేతన్ అదుర్స్

Published Fri, Mar 7 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

కర్నూలు కళానికేతన్ అదుర్స్

కర్నూలు కళానికేతన్ అదుర్స్

 కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్ : నగరంలోని పార్కురోడ్డులో ఉన్న మహిళల ప్రత్యేక షోరూం కళానికేతన్‌లో ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత గురువారం సందడి చేశారు. షోరూం రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె భారీ కేక్‌ను కట్ చేశారు. రెండు, మూడు ఫ్లోర్‌లలో కలియ తిరిగి పట్టు చీరెలను పరిశీలించారు.  అక్కడే విలేకరులతో మాట్లాడుతూ కర్నూలుకు మొదటి సారి వచ్చానని, నగరం ఎంతో బాగుందని అన్నారు. సినీ పరిశ్రమలో తనను ఆదరిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కళానికేతన్ షోరూం రెండవ వార్షికోత్సవంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చి వ్యయ ప్రయాసలతో చీరెలు కొనుగోలు చేసే అవసరం లేదన్నారు. కళానికేతన్‌లో నాణ్యమైన, ఆధునిక వస్త్రాలను అందుబాటులో పెట్టారని పేర్కొన్నారు.
 
  కళానికేతన్ షోరూం నిర్వాహకులు నీలా కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన అనతి కాలంలోనే మహిళలు ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రెండో వార్షికోత్సవం సందర్భంగా మహిళామణుల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామన్నారు. శారీస్, గాగ్రాస్, సల్వార్స్, వెస్ట్రన్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్‌లపై భారీగా తగ్గింపు ధరలతో అన్ని వస్త్రాలు అందిస్తున్నామన్నారు. చీరెల నుండి కిడ్స్ వేర్ వరకు 50 నుండి 30 శాతం ప్లాట్ ధరలు తగ్గించామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement