ఇటీవల జరిగిన ‘సౌత్ కాన్‌క్లేవ్ 2018’ సదస్సులో ‘సెక్సిజమ్ ఇన్ సినిమా’, ఇండస్ట్రీలో ఉన్న మేల్ డామినేషన్, క్యాస్టింగ్ కౌచ్ వంటి సంచలనాత్మక‡విషయాల గురించి కథానాయికలు ప్రణీత, శ్రుతీ హరిహరన్ తమ అభిప్రాయాలు చెప్పారు.
హీరోయిన్స్... జస్ట్ ఐ–క్యాండీ: ప్రణీత
∙సినిమా ఇండస్ట్రీలోనే కాదు జెండర్ డిస్క్రిమినేషన్ (లింగ వివక్ష) అనేది ఎక్కడైనా ఉంది. స్త్రీ ఎక్కడైనా చిన్న చూపుకు గురవుతోంది. సినిమాలో హీరోయిన్స్ నిర్ణయాలకు అసలు విలువ ఉండదు. నా ఫస్ట్ సినిమాలో నేను రూమ్‌లోకి పరిగెత్తుకొని వెళ్లే షాట్ ఉంది. కెమేరా యాంగిల్ నా కంట్రోల్‌లో లేదు. సీన్‌ను స్లో మోషన్‌లో తీశారు. అది అలా తీయదగ్గది కాదు. అంత చిన్న షాట్‌ను అలా తీసేసరికి నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ∙లక్కీగా నాకు క్యాస్టింగ్ కౌచ్ వంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ హీరోయిన్స్ తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెబితే కచ్చితంగా విమర్శలకు గురవుతారు. పార్వతి (మలయాళ కథానాయిక) విషయాన్నే తీసుకోండి. కేవలం ఒక స్టార్ హీరో నటించిన సినిమాలోని అభ్యంతరకరమైన దృశ్యం గురించి పాయింట్ రైజ్ చేసినందుకే సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురయ్యారామె. అలాగే, ఓ సూపర్ స్టార్ సినిమా పోస్టర్‌ని పేరు చెప్పకుండా ఒక హీరోయిన్ విమర్శిస్తే.. ఆమె ఆ హీరో అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ∙కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌కు పాత్ర అనేది ఏం ఉండదు. కేవలం ఐ–క్యాండీ (కనువిందు)గా, గ్లామరస్‌గా, బబ్లీగా కనిపిస్తే చాలు అంటారు. బట్ ఇటువంటి సినిమాల ద్వారా వచ్చే పాపులారిటీని కాదనలేం. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌కి చెందిన మేల్ ఆడియన్స్ హీరోయిన్లను గ్లామరస్‌గా చూడ్డానికి ఇష్టపడతారనుకుంటా. వాళ్లకు ఏం కావాలో అదే మేం చేస్తున్నాం.
నాతో పాటు చెప్పులుంటాయి అన్నాను: శ్రుతీహరిహరన్
∙సినిమాలో హీరోకి డాక్టర్, ఇంజనీర్, జర్నలిస్ట్ అని ఏదో ఒక ప్రొఫెషన్ ఉంటుంది. హీరోయిన్స్‌కు ఒక క్యారెక్టరైజేషన్ ఉండదు. కేవలం వారి అందచందాలను చూపించటానికే ఉపయోగపడతున్నారు. వారి శరీరం మీద సినిమా వ్యాపారం జరగడం విచారకరం. ∙నా 18 ఏళ్ల వయస్సులోనే క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నా. హీరోయిన్‌గా పరిచయం కాకముందు డ్యాన్సర్‌గా చేశా. అప్పుడు అభ్యంతరకర సంఘటనలు ఎదురైతే ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. మా కొరియోగ్రాఫర్‌ను అడిగితే ‘హ్యాండిల్ చేయటం రాకపోతే వదిలేయ్ అన్నారు’ దాంతో ఆ సినిమాను వదిలేశాను. ఆ తర్వాత ఒక బడా తమిళ ప్రొడ్యూసర్ నేను నటించిన కన్నడ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకొని, నన్నే నటించమన్నారు. ‘నాతో పాటుగా నలుగురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మాకు కావాల్సిన విధంగా నిన్ను ఎక్స్‌చేంజ్ చేసుకోదలిచాం’ అన్నారాయన. ఈసారి ఎలా డీల్ చేయాలో నాకో ఐడియా వచ్చింది. ‘‘నాతో పాటు ఎప్పుడూ స్లిప్పర్స్ క్యారీ చేస్తుంటాను’’ అని సమాధానం ఇచ్చాను. దాంతో ‘ఈ అమ్మాయితో వర్క్ చేయటం చాలా కష్టం’ అని న్యూస్ స్ప్రెడ్ చేశారు. నాకు ఆఫర్స్ రావటం తగ్గిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment