హీరోయిన్ ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆకట్టుకునే కళ్లతో పాటు అంద,చందాలతో తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'రభస', 'డైనమైట్', ‘అత్తారింటికి దారేది’లాంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. గతేడాది ఓ పాపకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం ప్రణీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ప్రణీత తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అవి కాస్త వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్ ఆమెను విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వారికి ప్రణీత గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘భీమన అమావాస్య’సందర్భంగా అనవాయితీ ప్రకారం నా భర్తకు పాదపూజ చేశాను. ప్రతి ఏడాది ఇలానే చేస్తాను. ఆ ఫోటోలను షేర్ చేసినందుకు గతంలో కూడా నేను విమర్శలు ఎదుర్కొన్నాను. అలా నన్ను ట్రోల్ చేసేవారికి ఇది పితృస్వామ్య రాజ్యంలా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం ఈ పూజ సనాతన ధర్మంలో ఒక భాగమే. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి పూజలకు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎన్నో కథలు కూడా హిందూ పురాణాల్లో ఉన్నాయి. మన సంస్కృతిలో అందరి దేవతలను ఒకేలా పూజిస్తాం’అని ప్రణీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
భీమన అమావాస్య కన్నడ నెల ఆషాడ (జూలై - ఆగస్టు)లో చంద్రుడు లేని రోజు (అమావాస్) నాడు జరుపుకుంటారు. ఈ రోజున మహిళలు తమ భర్తలు మరియు సోదరుల క్షేమం కోసం ప్రార్థిస్తారు. ఈ ఆచారాన్ని దీపస్తంభ పూజ అని కూడా అంటారు. తుళునాడుకు ఇది పెద్ద పండగ. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లో భీమన అమావాస్యను పెద్ద ఎత్తున జరుపుకొంటారు.
Comments
Please login to add a commentAdd a comment